Three Drunk People Arrested in Peddapalli: పెద్దపల్లి జిల్లాలో మందుబాబులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. పుట్టిన రోజు సంబురాలతో రాత్రి 12 గంటల సమయంలో టపాసులు పేల్చి, కేకలు పెడుతున్నారు. దీంతో అక్కడ నివసిస్తున్న వారు ఇబ్బందిపడుతున్నారు. అంతటితో ఆగకుండా మద్యం తాగి రోడ్లపై వాహనాలపై తిరుగుతూ స్టంట్లు చేస్తున్నారు. పక్కనే ఉన్న వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వీటిపై పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా వారు మాత్రం వారి పంథా మార్చుకోవడం లేదు. ఇలాంటి వారిపై స్థానికులు ఫిర్యాదు చేయాలన్నా ఎక్కడ గొడవకు దిగుతారో అని భయపడుతున్నారు.
మద్యం మత్తులో వీరంగం : తాజాగా మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ముగ్గురు యువకులను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన విశ్వతేజ, అరుణ్ కుమార్, సాయితేజ మద్యం సేవించి బర్త్‌డే సంబురాలు చేసుకున్నారు. అక్కడ ఫుల్‌గా మద్యం తాగి మత్తులో ఓ ఇంటికి సంబంధించిన సీసీటీవీ కెమెరాలతో పాటు అక్కడే ఉన్న ఆటో అద్దాలను ధ్వంసం చేశారు.