Pawan Kalyan Key Comments:వైఎస్ జగన్ను భయపెట్టే భారీ మెజారిటీ ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని ఉద్ఘాటించారు. పెడన, మచిలీపట్నంలలో నిర్వహించిన ప్రజాగళం భహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ అదే మద్యం లో 40వేల కోట్లు దోచుకున్నాడని పవన్ ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేయకపోగా కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలు హరిస్తున్న వైసీపీని తన్ని తరిమేయాలన్నారు.
పెడన ఎమ్మెల్యే పెనమలూరు పారిపోయాడు: ఒడిపోతున్నాననే బాధతో జగన్ చాలా కోపంగా ఉన్నాడని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అరాచకం చేసిన వైసీపీ రౌడీలను మాత్రం వదలదని పవన్ హెచ్చరించారు. పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు ఉచ్చరించటం కూడా తనకిష్టం లేదని పవన్ వ్యాఖ్యానించారు. భీమవరం జనసేన సీటు గురించి మాట్లాడిన జగన్, పెడన ఎమ్మెల్యే ఎందుకు పెనమలూరు పారిపోయాడో సమాధానం చెప్తాడా అని ప్రశ్నించారు. తన పాలన మీద నమ్మకం ఉంటే 70మంది ఎమ్మెల్యేలను జగన్ ఎందుకు మార్చాడని నిలదీశారు. తమ కులానికి చెందిన నేతలతోనే తమను తిట్టిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని రామరాజ్యం వైపు నడిపించేందుకే కూటమి ఏర్పాటు- పవన్ కల్యాణ్ - Pawan Bforms to Janasena Candidates