తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సుల ఏర్పాటులో ఏపీఎస్​ఆర్టీసీ విఫలం - ప్రయాణికుల ఇబ్బందులు - Passengers Problems in AP - PASSENGERS PROBLEMS IN AP

Huge Rush of Voters in AP : ఓటు వేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు లక్షలాది మంది ఏపీ ఓటర్లు తరలివెళ్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన బస్సులు నడపడంలో మాత్రం ఏపీఆర్టీసీ ఘోరంగా విఫలమైంది. అరకొరగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి, అధికారులు చేతులు దులుపుకున్నారు. సరిపడా బస్సులు నడపకుండా ఓటర్లను ముప్పుతిప్పలు పడుతున్నారు. ఫలితంగా బస్టాండ్‌లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

Passengers Problems in AP
Huge Rush of Voters for Hometown (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 2:01 PM IST

బస్సుల ఏర్పాటులో ఏపీఎస్​ఆర్టీసీ విఫలం - ప్రయాణికుల ఇబ్బందులు (ETV Bharat)

Passengers Problems in AP : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఓటర్లను ఇబ్బంది పెట్టేలా ఏపీఎస్ ​ఆర్టీసీ చర్యలు ఉన్నాయని ప్రయాణికులు ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు లక్షల మంది ఏపీ ప్రజలు తరలివెళ్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన బస్సులు నడపడంలో ఏపీ​ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా చాలా తక్కువ సంఖ్యలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని అన్నారు.

AP Voters Travel Issue In Hyderabad : నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 45 ప్రత్యేక బస్సులను మాత్రమే ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గుంటూరు 18, మచిలీపట్నం 23, ఏలూరు 20, పశ్చిమ గోదావరి 16, తూర్పుగోదావరికి 7, అమలాపురం 8, కాకినాడ 8, అనకాపల్లికి 1 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం ఆర్టీసీ ఏర్పాటు చేయలేదు. బస్సులు లేక అతికష్టం మీద తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో ఓటర్లు ఏపీకి వచ్చారు.

హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఇప్పటికే టీడీపీ అధినేత లేఖ రాశారు. మరోవైపు ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకుంటూ ప్రత్యేక బస్ సర్వీసులు టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఏపీకి వచ్చే ప్రజల కోసం ఏపీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఏపీలో ప్రధాన నగరాల నుంచి జిల్లాలకు, గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు.

ఇట్లయితే మేం ఓటేసినట్లే - సొంతూళ్లకు పయనమైన ఆంధ్రా ఓటర్లు - సరిపడా బస్సుల్లేక అవస్థలు - AP Voters Travel Issue in Hyderabad

ఓటర్లు బస్టాండ్లలో పడిగాపులు :దసరా, సంక్రాంతి పండుగలకు వచ్చినట్లు ఓట్ల పండుగకు ప్రజలు తరలివస్తున్నా ఆర్టీసీ రవాణా సదుపాయాలు కల్పించలేదు. బస్సుల కోసం ఓటర్లు బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో ప్రధాన నగరాల నుంచి జిల్లాలకు, గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేయలేదు. పోనీ ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీల బాదుడును భరించే స్తోమత సామాన్యులకు లేదు. ఎలాగైనా ఓటు వేద్దామన్న సంకల్పంతో బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

విజయవాడ బస్టాండ్​లో విపరీతమైన రద్దీ నెలకొంది. ఆర్టీసీ రద్దీకి సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదు. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరుకు బస్సుల కొరత ఏర్పడింది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు సరిపడా లేవు. రెగ్యులర్ సర్వీసులు ఏ మాత్రం సరిపోవడం లేదు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద ప్రయాణికులు బారులు తీరారు.

ఆర్టీసీ తీరుపై మండిపడుతున్న ప్రయాణికులు : ఏ ప్రాంతానికీ ప్రత్యేక బస్సులు తిరగడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద ప్రయాణికులు భారీ క్యూలో అవస్థలు పడుతున్నారు. కనీసం రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను, సిబ్బందిని ఆర్టీసీ అధికారులు పెంచలేదు. ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సులు లేక ఉదయం 5 గంటల నుంచీ బస్టాండ్ లోనే వేలాదిమంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సుల సమాచారం అడిగినా ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దారులన్నీ ఏపీవైపే - హైదరాబాద్​ - విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ - Vehicles traffic at Panthangi toll

ఓటు వేసేందుకు సొంతూరి బాట - ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట - Public Rush For AP Polls

ABOUT THE AUTHOR

...view details