Passengers Problems in AP due to No Buses: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఓటర్లను ఇబ్బంది పెట్టేలా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు ఉన్నాయని ప్రయాణికులు ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు లక్షల మంది ఎపీ ప్రజలు తరలివస్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన బస్సులు నడపడంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా చాలా తక్కువ సంఖ్యలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని అన్నారు.
ఘోరంగా విఫలమైన ఏపీఎస్ఆర్టీసీ - బస్సులు లేక అష్టకష్టాలు - అధికారుల తీరుపై ప్రయాణికుల ఆగ్రహం (ETV Bharat) నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 45 ప్రత్యేక బస్సులను మాత్రమే ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గుంటూరు 18, మచిలీపట్నం 23, ఏలూరు 20, పశ్చిమ గోదావరి 16, తూర్పుగోదావరికి 7, అమలాపురం 8, కాకినాడ 8, అనకాపల్లికి 1 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం ఆర్టీసీ ఏర్పాటు చేయలేదు. బస్సులు లేక అతికష్టం మీద తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో ఓటర్లు ఏపీకి వచ్చారు.
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలనుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఇప్పటికే టీడీపీ అధినేత లేఖ రాశారు. మరోవైపు ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకుంటూ ప్రత్యేక బస్ సర్వీసులు టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఏపీకి వచ్చే ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఏపీలో ప్రధాన నగరాల నుంచి జిల్లాలకు, గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు.
రాష్ట్రం బాట పట్టిన ఓటర్లు - హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ - TRAFFIC AT HYD VIJAYAWADA HIGHWAY
దసరా, సంక్రాంతి పండుగలకు వచ్చినట్లు ఓట్ల పండుగకు ప్రజలు తరలివస్తున్నా ఆర్టీసీ రవాణా సదుపాయాలు కల్పించలేదు. బస్సుల కోసం ఓటర్లు బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో ప్రధాన నగరాల నుంచి జిల్లాలకు, గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేయలేదు. పోనీ ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీల బాదుడును భరించే స్తోమత సామాన్యులకు లేదు. ఎలాగైనా ఓటు వేద్దామన్న సంకల్పంతో బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
విజయవాడ బస్టాండ్లో విపరీతమైన రద్దీ నెలకొంది. ఆర్టీసీ రద్దీకి సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదు. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరుకు బస్సుల కొరత ఏర్పడింది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు సరిపడా లేవు. రెగ్యులర్ సర్వీసులు ఏ మాత్రం సరిపోవడం లేదు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద ప్రయాణికులు బారులు తీరారు.
ఏ ప్రాంతానికీ ప్రత్యేక బస్సులు తిరగడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద ప్రయాణికులు భారీ క్యూలో అవస్థలు పడుతున్నారు. కనీసం రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను, సిబ్బందిని ఆర్టీసీ అధికారులు పెంచలేదు. ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సులు లేక ఉదయం 5 గంటల నుంచీ బస్టాండ్ లోనే వేలాదిమంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సుల సమాచారం అడిగినా ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ 'సిద్ధం' సభలకు ఆర్టీసీ బస్సులు ఫుల్ - ఓటేసే వారికి నైయ్ - మర్మమేంటో ! - NO Special Buses For Voters