ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మార్వో రమణయ్య హత్యపై తీవ్రంగా స్పందించిన రాజకీయపక్షాలు, ఉద్యోగ సంఘాలు - Tehsildar killed in Visakha

Parties and Employees association reaction on MRO Murder: విశాఖ జిల్లా చినగదిలి రూరల్ తహసీల్దారు సనపల రమణయ్య దారుణహత్యపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు బాధితులుగా మిగిలిపోతున్నాయన్న టీడీపీ నేతలు, చివరకు అధికారుల హత్యలకు గురికావడం పరాకాష్టకు చేరినట్లైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చాయి.

tehsildar_murder
tehsildar_murder

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 4:00 PM IST

Updated : Feb 3, 2024, 4:45 PM IST

Parties and Employees association reaction:విశాఖ జిల్లా చినగదిలి రూరల్ తహసీల్దారు సనపల రమణయ్య దారుణహత్య పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రమణయ్య నివాసం ఉంటున్న కొమ్మాదిలోని చరణ్‌ క్యాస్టిల్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అక్కడకు వచ్చి ఇనుపరాడ్లతో దాడి చేయగా ఆయన అక్కడికక్కడే కుప్పకూలడం అధికారులను కలవరపెడుతోంది. రమణయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు,ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు.

గ్రామ వాలంటీర్​ దారుణ హత్య - వివాహేతర సంబంధమే కారణమా ?

TDP Leader Achchennaidu:సీఎం జగన్ రెడ్డికి తన ఆర్దిక భద్రతపై ఉన్న శ్రద్ద రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతి భద్రతలకు అద్దంపడుతోందన్నారు. మండల తాహశీల్దార్​నే ఇంటికి వెళ్లి హత్య చేశారంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని అచ్చెన్నాయుడు నిలదీశారు. ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని తెలిపారు.

వైసీపీ వచ్చాక రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం అమలవుతోందని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే హోమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అసలు హోంమంత్రి ఎవరో వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి తెలియదని అన్నారు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ చేపట్టి దోషుల్ని శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

బీమా సొమ్ము కోసం హర్రర్ సినిమాను తలదన్నే ప్లాన్ - పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు

AP Revenue Services Association Leaders :తహశీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తిలు తీవ్రంగా ఖండించారు. రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. హత్యకు కారకులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తహశీల్దార్ రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల తహశీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలన్నారు. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిపై దాడులకు సంబంధించి, దోషులపైన చర్యలు తీసుకోవడానికి కఠినమైన చట్టం తీసుకురావాలన్నారు. తహసీల్దార్ దారుణ హత్యకు నిరసనగా ఇవాళ 26 జిల్లాలో రెవిన్యూ ఉద్యోగులందరూ నల్ల బాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

వదినను హతమార్చి ఆత్మహత్యాయత్నం- వివాహేతర సంబంధమే కారణమా?

TDP Leader Rajababu:మండల స్థాయి వ్యక్తి దారుణ హత్యకు గురికావడంపై సహచర ఉద్యోగులు, స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులతో ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమవుతోందని టీడీపీ నేత రాజాబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో ఇలాంటి ఘటనలు పెరిగాయని ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తహసీల్దారు మృతికి టీడీపీ నేతల నివాళులు - వైసీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Last Updated : Feb 3, 2024, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details