తెలంగాణ

telangana

పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు - Panchayat Election Voter List

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 5:19 PM IST

Updated : Aug 21, 2024, 7:38 PM IST

Telangana Panchayat Election Voter List : తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ కానుంది. సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా ప్రచురణ కానుంది.

Telangana Panchayat Election Voter List Schedule
Telangana Panchayat Election Voter List (ETV Bharat)

Telangana Panchayat Election Voter List Schedule :పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబరు 6 నుంచి వార్డులవారీగా ఓటరు జాబితా తయారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటరు జాబితా రావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పంచాయతీ రాజ్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్‌ ఖరారు చేశారు.

సెప్టెంబరు 6న పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. సెప్టెంబరు 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరించి అదే నెల 21న తుది జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబరు 9, 10న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరిస్తారు. ఓటరు జాబితా తయారీపై ఈనెల 29వ తేదీ ఉదయం పదకొండున్నరకి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Last Updated : Aug 21, 2024, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details