Online Uploading of Comprehensive Household Survey Details :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకు ఆ రోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరించి వాటిని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని వారికి ఫోన్ చేసి మరీ వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నిబంధన ప్రకారం సర్వే చేస్తున్నారు. గ్రామల్లో ఉండి నగరంలో సెటిల్ అయిన వారు సైతం ఇక్కడే తమ వివరాలను ఇస్తున్నారు. అందుకు సంబంధించి ధ్రువపత్రాలను అందిస్తున్నారు.
ఆన్లైన్ ఎంట్రీ ఆపరేటర్లకు అప్పగింత :ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 పట్టణాలు, 26 గ్రామీణ మండలాలు ఉన్నాయి. ఈ కుటుంబాల వివరాలను సర్వే చేసేందుకు బ్లాకులుగా విభజించారు. ఒక్కో ఎన్యుమరేటర్కు 150 నుంచి 175 వరకు కుటుంబాలను కేటాయించి వివరాలు సేకరించే పనిని ఇచ్చారు. కేటాయించిన ప్రకారం ఎన్యుమరేటర్లు వివరాల సేకరించారు. ఈ నెల 6న సర్వే ప్రారంభం కాగా 8వ తేదీ వరకు కుటుంబాలను గుర్తించి ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. అనంతరం ఇంటింటి సర్వే చేపట్టారు. ఓవైపు సర్వే కొనసాగుతుండగానే మరోవైపు సేకరించిన సర్వే వివరాలను ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసే పనిని ఆపరేటర్లు ప్రారంభించారు.
'కొందరి ఆచూకీ, చిరునామా తెలియడం లేదు - వారి వివరాలు చెబుతారా ప్లీజ్'