అప్పు తీసుకోకున్నా ఖాతాలో జమ చేస్తున్నారు - వడ్డీతో సహా కట్టాలంటూ బెదిరిస్తున్నారు Online Loan App Harassment Cases : సైబర్ నేరగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా డబ్బులు కొల్లగొట్టడంలో తగ్గట్లేదు. గతంలో లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసి రుణం తీసుకుంటేనే వేధించేవారు. కానీ ప్రస్తుతం ధన దోపిడీకి నయా మార్గాలను ఎంచుకుంటున్నారు. దీనిపై నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టిసారించి వందలాది నిందితుల్ని అరెస్టు చేశారు. సైబర్‌క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో వెయ్యికి పైగా యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించారు.
Cyber Fraud in Hyderabad : ప్రజల్లో అవగాహన పెరగడంతో లోన్‌యాప్ నేరాలు కొంతమేర తగ్గాయి. ఈ క్రమంలోనే నేరగాళ్లు కొత్త పంథాలో బెదిరింపులకు దిగుతున్నారు. సంబంధం లేని వ్యక్తులకు ఫోన్లు చేసి రుణం తీసుకున్నారు డబ్బు కట్టాలంటూ వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతేడాది రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు లోన్ యాప్ ముఠాను అరెస్టు చేసినప్పుడు ఈ మోసం వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ బారీకి ఒకసారి లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని తిరిగి కట్టాడు. నేరగాళ్లు కొన్ని రోజుల తర్వాత అతని ప్రమేయం లేకుండానే ఖాతాకు రూ. 10 వేల రూపాయలను పంపి తద్వారా వడ్డీల రూపంలో రూ. 2 లక్షల 49 వేల రూపాయలు వసూలు చేశారు.
రుణం తీసుకోకున్నా బ్యాంకు ఖాతాలో జమ : మరో కేసులో నగరానికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు మార్చిలో తన ఫోన్‌లో స్పీడ్లోన్ యాప్‌ను పొరపాటున క్లిక్ చేయగా రూ.5 లక్షల రుణం మంజూరైనట్లు చూపించింది. ఆమె ప్రమేయం లేకుండానే మూడు దఫాలుగా ఖాతాలో రూ. 6 వేల 480 జమ చేసి రూ. 9వేల 600 రూపాయలు లాగేశారు. అయినా బెదిరింపులు మాత్రం ఆగలేదు. ఆమె వ్యక్తిగత చిత్రాల్ని నగ్నంగా మార్చి ఆమె ఫోన్‌లోని కాంటాక్ట్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించారు.
Loan App Harassment Hyderabad : లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా.. బీ కేర్‌ఫుల్ బ్రదర్!
ఫొటోలు మార్ఫింగ్ :మరో కేసులో ఇంజినీరింగ్ విద్యార్థికి ఇటీవల వాట్సాప్ కాల్ వచ్చింది. లోన్‌యాప్ నుంచి మాట్లాడుతున్నామని ఇటీవల తీసుకున్న రూ. 2 వేలకు వడ్డీతో కలిపి రూ.3 వేల 500 రూపాయలు కట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మాత్రం తాను డబ్బు తీసుకోలేదని పదేపదే చెప్పినా పట్టించుకోకుండా వేధించారు. ఇలా డబ్బులు జమ చేసి అడిగినంత తిరిగి కట్టకపోతే ఫోటోలు నగ్నంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించడం, కుటుంబ సభ్యులకు అసభ్య సందేశాలు పంపిస్తూ ఇంటాబయటా పరువు తీసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. బాధితులు ఈ దారుణాలను భరించలేక బయటకు చెప్పలేక మనోవేదన అనుభవిస్తున్నారు.
బ్యాంకు ఖాతాదారుల డేటా అంగట్లో సరుకులా మారడమే ఈ తరహా వేధింపులకు కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకు ఏదైనా ఖాతాదారుల పేరు, ఫోన్ నెంబర్లు, చిరునామా, నామిని, లావాదేవీల వివరాలు తదితర డేటా బయటకు పొక్కుతోంది. వీటిని సేకరిస్తున్న రుణయాప్ నిర్వాహకులు ఈ తరహా నేరాలకు దిగుతున్నారు. కొందరు అత్యవసర సందర్భాల్లో లోన్‌యాప్ నుంచి 10 వేల లోపు రుణాలు తీసుకుని తిరిగి కట్టేస్తారు. ఇలాంటి వారు మళ్లీ రుణం తీసుకోకపోయినా నేరగాళ్లు మాత్రం ఎంతో కొంత డబ్బు జమ చేస్తారు.
ఆ తర్వాత ఫోన్ చేసి వడ్డీతో సహా కట్టాలని నరకం చూపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లోన్ యాప్ పేరుతో వచ్చే ప్రకటనలి నమ్మొద్దని వీటిద్వారా రుణం తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అసలు యాప్ డౌన్‌లోడ్ చేసుకోకున్నా రుణం తీసుకోకున్నా ఎవరైనా డబ్బు కట్టాలని ఫోన్లు చేస్తే తమను సంప్రదించాలన్నారు. పదేపదే ఫోన్ చేసి వేధించినా నగ్నచిత్రాలు పంపించిన వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో లాభాల పేరిట ఎర - రూ.10లక్షలకు పైగా కాజేసిన సైబర్ కేటుగాళ్లు - Cyber Crime in Hyderabad
మోసపోయిన మహిళా లాయర్- నగ్నంగా వీడియో కాల్, రూ.15లక్షలు లాస్- డ్రగ్స్ టెస్ట్ పేరుతో దోపిడీ - Woman Lawyer Case On Fake Officers