తెలంగాణ

telangana

ETV Bharat / state

యువ ఔత్సాహికుల వినూత్న ఆవిష్కరణలు- అకట్టుకున్న వన్‌ డిస్ట్రిక్ట్‌ - వన్‌ ఎగ్జిబిషన్‌ - One Exhibition program tsic naabard

One District - One Exhibition Program : వంట చేసే మహిళలకు కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. మందుల పిచికారీలో కూలీల మార్గం సుగమమైంది. రైతులు కరెంట్‌ షాక్‌ గురయ్యే ప్రమాదం తగ్గనుంది. వరి పంటలో కలుపు తీయడం తేలికైంది. చేతికొచ్చిన పంట జంతువులు, పక్షుల పాలు కాకుండ ఉండేందుకు పరిష్కారం దొరికింది. వీటన్నింటికీ వన్ డిస్ట్రిక్‌-వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం వేదికైంది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో తెలుసుకోవాలని ఉందా! అయితే లేట్‌ చేయకుండా ఈ స్టోరీ చూసేయండి.

One Exhibition Program in Mahbubnagar
One District One Exhibition Program

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 4:01 PM IST

యువ ఔత్సాహికుల వినూత్న ఆవిష్కరణలు- అకట్టుకున్న వన్‌ డిస్ట్రిక్ట్‌- వన్‌ ఎగ్జిబిషన్‌

One District- One Exhibition Program : ఆలోచించాలి, ఆవిష్కరించాలి, అద్భుతాలు సృష్టించాలి. ఇవే! నేటి యువత మదిలో మెదిలే ప్రశ్నలు. అందుకోసం అత్యాధునిక సాంకేతికతను సైతం ఇట్టే అందిపుచ్చుకుంటున్నారు. సమస్య ఏదైనా, పరిష్కారం వైపు వడివడిగా అడుగులేస్తున్నారు. అలాంటి వారి కోసమే టీఎస్‌ఐసీ(TSIC), నాబార్డు సంయుక్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చూట్టాయి.

One Exhibition Program in Mahbubnagar :మహబూబ్‌నగర్‌ శిల్పారామంలో వన్ డిస్ట్రిక్ట్- వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 33 జిల్లాల నుంచి ఇంటింటా ఎన్నోవేషన్‌గా ఎంపికైన ప్రాజెక్టులను ప్రదర్శించారు. వినూత్నంగా రూపొందించిన ఈ ఆవిష్కరణలు చూపరుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వర్షం పడి నగరాల్లోని రోడ్లన్ని జలసంద్రంలా మారతాయి. ఆ నీటిని మల్లించడం కోసం రోడ్లపై ఉన్న మ్యాన్‌హోల్స్‌ని తెరుస్తారు. ఆ క్రమంలో డ్రైనేజీలో కనబడక ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి.

అథ్లెటిక్‌ కోచ్‌గా ఆదిలాబాద్ అడవి బిడ్డ - గిరిజన విద్యార్థులకు శిక్షణ

ఈ సమస్యకు పరిష్కారం చూపింది ఓ యువతి. చేతికొచ్చిన పంటలకు పక్షులు, జంతువుల బెడద ఎక్కువ. వాటిని పారద్రొలేందుకు రైతులు నానా అవస్థలు పడతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చంటున్నారు. పాఠశాలల్లో వంట చేసే వారి కోసం మహిళ వంటమిత్ర ప్రాజెక్టును తయారు చేసింది ఈ విద్యార్థి. తన ప్రాజెక్టు ద్వారా సులభంగా వంట చేయొచ్చని అంటోంది.

పొలాల్లో మనుషుల అవసరం లేకుండా మందులు పిచికారీ చేసే ఈ యంత్రం పేరు మ్యాజిక్‌ స్ప్రేయర్. ఇది రిమోట్‌తో కంట్రోల్‌ చేయవచ్చని ప్రవీణ్‌ అంటున్నాడు. తన తల్లి పడే ఆవస్థను చూసి చలించిపోయాడు ఈ యువకుడు. అందుకోసం ఫర్టిలైజర్ ఇంజెక్టర్‌ని తయారు చేశాడు. దీని వల్ల మందులు సులభంగా మొక్కలకు వెయోచ్చని అంటున్నాడు. ఇవే కాకుండా రైతులకు ఉపయోగపడే మెకానికల్ కంట్రోల్ టర్న్ ఆన్, ఆఫ్‌ వాల్వ్ సిస్టమ్, వరిలో కలుపునివారణ, పిలకశాతాన్నిపెంచేందుకు ప్యాడీ సర్పింగ్ వీడర్‌ రూపొందించాడు.

అలాగే మల్టీ పర్పస్ స్ప్రే పంపులు, కిసాన్ రిమోట్, ఫర్టిలైజన్ లేయింగ్ మిషన్, ఎలక్ట్రిక్ స్ప్రేయర్, రూం టెంపరేచర్ కంట్రోల్డ్ ఆటోమేటెడ్ ఫ్యాన్ వంటివి ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యవతలో నైపుణ్యాలకు కొదవలేదు. ఇలాంటి కార్యక్రమాలు వారికి ఎంతో ఊతమిస్తాయి. ఈ ఔత్సాహికులకు సహకారం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలకు ప్రాణం పోస్తారు.

"పొలాల్లో మనుషుల అవసరం లేకుండా మందులు పిచికారీ చేసే ఈ యంత్రం పేరు మ్యాజిక్‌ స్ప్రేయర్. ఇది రిమోట్‌తో కంట్రోల్‌ చేయవచ్చు. అలాగే మొక్కలకు మందులు వేయడానికి ఫర్టిలైజర్‌ ఇంజెక్టర్‌ తయారు చేశాము. దీని వల్ల సులభంగా మందులు వేయవచ్చు. - ఔత్సాహిక ఆవిష్కర్త

తండ్రి కలను నిజం చేసేందుకు సివిల్స్ సాధించా : ఐపీఎస్ మౌనిక

భారత్‌లోనే యంగెస్ట్‌ స్టూడెంట్‌ పైలట్​గా హైదరాబాద్ కుర్రాడు - 16 ఏళ్లకే ఎలా అయ్యాడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details