తెలంగాణ

telangana

ETV Bharat / state

అచ్యుతాపురం ఘటన - మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం - ATCHUTAPURAM VICTIMS EX GRATIA - ATCHUTAPURAM VICTIMS EX GRATIA

Compensation to Atchutapuram Victims Families : అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించిన ఘటన ఏపీని కుదిపేసింది. ఈ ఘటనలో 17మంది మరణించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది.

Compensation to Atchutapuram
Compensation to Atchutapuram (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 3:39 PM IST

Atchutapuram Victims Families Ex Gratia :ఏపీఅన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ ఎసెన్షియా సంస్థ‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల‌ కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం చెల్లించ‌నున్న‌ట్లు విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. కేజీహెచ్ మార్చురీ వ‌ద్ద బాధిత కుటుంబాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ప‌రామ‌ర్శించి ఓదార్చారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : ఈ సంద‌ర్భంగా అక్క‌డ‌కు వ‌చ్చిన మీడియాతో క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ మాట్లాడారు. కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన వారికి ప‌రిహారం, క్ష‌త‌గాత్రుల‌కు వైద్య చికిత్స‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. ప్ర‌మాదంలో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు.

అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్​ బ్లాస్ట్- 17 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు - Reactor exploded in Anakapalle

Atchutapuram Reactor Explosion Latest News :ఫార్మా సెజ్​లో జరిగిన ప్రమాదం అనుకోని దుర్ఘ‌ట‌న అని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అ న‌కాప‌ల్లి, విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాల యంత్రాంగాలు స‌కాలంలో స్పందించి చాలా మంది ప్రాణాలు కాపాడ‌గ‌లిగాయ‌ని అన్నారు. ప్ర‌మాదంలో మృతి చెందిన 12 మృత‌దేహాలు కేజీహెచ్​కు వ‌చ్చాయ‌ని, గురువారం మ‌ధ్యాహ్నం నాటికి పోస్టు మార్టం పూర్తి చేసి సంబంధిత మృతదేహాల‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తామ‌ని చెప్పారు.

గాయ‌ప‌డిన వారిలో ప‌ది మంది విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. వెంకోజిపాలెంలోని మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిలో ఏడుగురు, కిమ్స్ ఆసుప‌త్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నార‌ని వెల్ల‌డించారు. వారంతా ప్ర‌స్తుతం బాగానే ఉన్నార‌ని తెలిపారు. మిగిలిన వారు అన‌కాప‌ల్లి జిల్లాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని వివ‌రించారు. మొత్తం 41 మంది గాయ‌పడ్డార‌ని చెప్పారు. దుర్ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయి విచార‌ణ చేస్తామ‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇప్ప‌టికే అన‌కాప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌తో మాట్లాడామ‌ని త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హ‌రేంధిర ప్ర‌సాద్ వెల్ల‌డించారు.

గ్లాస్​ పరిశ్రమలో గ్యాస్​ కంప్రెషర్​ పేలుడు - అయిదుగురు దుర్మరణం - blast in south glass factory

రాయచోటిలో విషాదం - గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం - Three Dead in Cylinder Blast

ABOUT THE AUTHOR

...view details