Off Day Schools In Telangana :రాష్ట్రంలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు పాఠశాలలు (Schools) కొనసాగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలిపింది. పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూల్ ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు.
students Work in Mahbubabad: స్కూల్ పిల్లలే.. అక్కడ పని పిల్లలు
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ విద్యాసంవత్సరం ముగిసే వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. 12.30 గంటలకే మధ్యాహ్న భోజనం పెట్టాలని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు.