Umpires Devices In Cricket Ground : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉండే క్రేజ్ వేరు. ఈ క్రీడను చాలా మంది ఇష్టంగా వీక్షిస్తుంటారు. క్రికెట్ మ్యాచ్‌లకు అంపైర్లు నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. వైడ్, నోబాల్, ఔట్, సిక్స్, ఫోర్ ఇలా అన్నింటిని అంపైర్లే వెల్లడిస్తారు. అంపైర్ల నిర్ణయమే క్రికెట్లో తుది నిర్ణయంగా ఉంటుంది. నిర్ణయంలో పొరపాటు దొర్లితే మ్యాచ్ ఫలితమే మారే ప్రమాదం కూడా ఉంటుంది.
అలా క్రికెట్లో ఇప్పటి వరకూ ఇలాంటి సందర్భాలు అనేక సార్లు జరిగాయి. ఒక్కోసారి అంపైర్లు తప్పిదానికి ప్లేయర్లు బలైన సందర్భాలు ఎన్నో. అందుకే వాళ్ల డెసిషన్ చెప్పే ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇలా పొరపాట్లు దొర్లకుండా, బంతి వారితి తాకకుండా అంపైర్లు మైదానంలో కొన్ని పరికరాలు ఉపయోగిస్తారు. ఈ క్రమంలో మ్యాచ్ సమయంలో అంపైర్లు ఉపయోగించే పరికరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- కౌంటర్ : ఒకప్పుడు బౌలర్ ఓవర్లో వేసిన బంతులను లెక్కించడానికి అంపైర్లు 6 నాణేలు, రాళ్లు, గోళీల సెట్ వాడేవారు. బౌలర్ బంతిని వేయగానే గోళీ లేదా రాయిని ఒక చేతి నుంచి మరో చేతికి బదిలీ చేసేవారు. అయితే సాంకేతిక పెరగడం వల్ల కౌంటర్‌ను వాడుతున్నారు. ఇందులోని బటన్లు నొక్కడం వల్ల ఓవర్లో ఎన్ని బంతులు పూర్తయ్యాయో అంపైర్లు ఈజీగా గుర్తించవచ్చు.
- స్నికో మీటర్ : స్నికో మీటర్‌ను థర్డ్ అంపైర్ ఉపయోగిస్తాడు. బంతి బ్యాట్ లేదా ప్యాడ్‌కు తాకిందా? లేదా? అనే దాన్ని నిర్ధారించడానికి దీన్ని వాడుతాడు. స్నీకో మీటర్లో బంతి బ్యాటర్ బ్యాట్ లేదా ప్యాడ్‌కు తగిలితే శబ్దాన్ని రికార్డు చేస్తుంది. తదనుగుణంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకుంటాడు. అధిక స్పైక్ ఉంటే బంతి బ్యాట్‌కు తగిలినట్లు లెక్క.
- బాల్ గేజ్ : బంతి సరైన ఆకారంలో ఉందా లేదా తెలుసుకోవడానికి బాల్ గేజ్ యూజ్ అవుతుంది. బంతిని బాల్ గేజ్ రింగ్‌లో పెడతారు. అప్పుడు బంతిని మార్చాలా వద్దా అనే విషయం తెలిసిపోతుంది.
- లైట్ ఓ మీటర్ : లైట్ ఓ మీటర్‌ను గ్రౌండ్లో వెలుతురు ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. దీన్ని ప్రధానంగా టెస్టు మ్యాచులలో యూజ్ చేస్తారు. గ్రౌండ్‌పై తగినంత వెలుతురు లేదని అంపైర్ భావిస్తే, మైదానం మధ్యలో ఉన్న అవుట్ ఫీల్డ్‌ను లైట్ ఓ మీటర్ ద్వారా చెక్ చేస్తాడు.
- రక్షణ కవచం : అంపైర్లు తప్పనిసరిగా వాడే పరికరం ప్రొటెక్టివ్ షీల్డ్. బ్యాటర్లు ఆడే విధ్వంసర షాట్ల నుంచి అంపైర్లను కాపాడుతుంది. దీన్ని అంపైర్లు చేతికి పెట్టుకుంటారు. అంపైర్ తనను తాను రక్షించుకోవడానికి ఈ షీల్డ్ వాడుతాడు.
- వాకీ టాకీ : వాకీ టాకీ అనేది మనకు మొబైల్ ఫోన్ ఎలాగో అంపైర్లుకు అలాంటిది. మ్యాచ్ రిఫరీతో కమ్యూనికేట్ అవ్వడానికి థర్డ్ అంపైర్ దీన్ని ఉపయోగిస్తాడు. అలాగే స్టంప్‌లకు జోడించిన మైక్రోఫోన్ శబ్దాలను వినొచ్చు. బౌండరీ, అనుమానాస్పద క్యాచ్, రనౌట్, స్టంపింగ్ వంటి ఏదైనా ఇతర నిర్ణయం గురించి అంపైర్ థర్డ్ అంపైర్‌ను వాకీటాకీలో అడుగుతాడు.
What are umpires cautious about while using walkie talkie during cricket matches?
— LOLz Alienz 👽 (@LOLzAlienz) October 26, 2022
Not to say over and out 🙄😑🤐#T20WorldCup #CricketTwitter pic.twitter.com/LBNVBHUnc9
తొలిసారిగా మహిళా అంపైర్ల అరంగేట్రం.. బీసీసీఐ అవకాశంతో..!
IPL Umpire Salary : ఐపీఎల్ అంపైర్ల శాలరీ అన్ని లక్షలా.. ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే?