Nyasta Gramojvala Solutions Founder :వ్యవసాయ విధానాల గురించి ఎలాంటి పరిజ్ఞానం లేకపోయినా సాగులో రైతులు ఎదుర్కొనే సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం చూపాలనుకుంది భార్గవి అనే ఈ యువతి. 'బాధ్యతాయుతమైన రైతుగా ఉండండి - బాధ్యతాయుతమైన వ్యవసాయం చేయండి, మీకు అవసరమయ్యే సాంకేతిక సాయం మేం అందిస్తాం' అనే నినాదంతో న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ అనే అంకురాన్ని మొదలు పెట్టింది ఈమె. తోటి మిత్రులతో కలసి వ్యవసాయంలో సరికొత్త ఆవిష్కరణలతో రైతాంగానికి చేయూత అందిస్తోంది. 2 సంవత్సరాల్లోనే న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ సంస్థ సేవలను 4 రాష్ట్రాలకు విస్తరించింది భార్గవి.
Nyasta Gramojvala Solutions Founder Bhargavi :ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు చెందిన భార్గవి తండ్రి చిట్టిబాబు ఫర్నీచర్ వ్యాపారం చేసేవారు. అయిదేళ్ల కిందట ఆయన కన్నుమూశారు. తల్లి మాధవీలత గృహిణి. స్థానికంగానే బీటెక్ వరకూ చదివిన భార్గవి, తిరుపతిలో ఎంటెక్ పూర్తయ్యాక హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరు ఉద్యోగం చేసేది. అక్కడ పని చేసే సమయంలోనే ఐఓటీ (IOT)ద్వారా సన్నకారు రైతులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకుంది. ముగ్గురు సహోద్యోగులతో కలసి రూ. 10 లక్షల పెట్టుబడితో రెండేళ్ల క్రితం "న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్" స్టార్టప్‌ను ప్రారంభించింది భార్గవి.
పంట పొలాలకు ఇళ్లు దూరంగా ఉండే రైతులు విద్యుత్ మోటార్ల ద్వారా పంటకు సరైన సమయానికి నీరు పెట్టేందుకు తరచూ ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనికి పరిష్కారం కనుగొన్న భార్గవి, రైతులు ఎక్కడి నుంచైనా పంటకు నీరు అందించే పరిజ్ఞానాన్ని కనుగొంది. దీని ద్వారా అనేక మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. భార్గవి తాము రూపొందిచిన యాప్ ద్వారా రైతులు ఎక్కడ నుంచైనా మొబైల్‌ను వాడి పొలంలోని పంపుసెట్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చని అంటోంది. మొదట ఈ పరిజ్ఞానాన్ని ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా పరీశీలించి చూసింది. తమ పరిశోధన విజయవంతం కావడంతో మరిన్ని అప్లికేషన్లను జత చేస్తానటోంది.
Nyatsa Company Services to Farmers For Agriculture :అలాగే ఈ డివైజ్ ద్వారా పొలాల్లోని లైట్‌ను ఆన్, ఆఫ్ చేయవచ్చని, జంతువులు, పక్షుల నుంచి పంట రక్షణ కోసం ప్రత్యేక శబ్దాలు వెలువరించే స్పీకర్‌ను డివైజ్‌కు జత చేశామంటోంది. న్యాస్టా అందించే సేవలు ఇప్పటికే మార్కెట్లో చాలా సంస్థలూ అందిస్తున్నాయని అంటోంది భార్గవి. అయితే ఇతర కంపెనీల పరికరాలకు 9 వేల రూపాయలపైనే చెల్లించాలని, అదే న్యాస్టాకు చెందిన కంప్లీట్ సొల్యూషన్ డివైజ్‌ను రూ. 6 వేలు, ఐవోటీ సిమ్‌ను 9 వందల రూపాయలకే ఇస్తున్నట్లు చెబుతోంది. ఇదే కాకుండా ఒకే డివైజ్ పే యాడ్ ఆన్ఫీచర్ వాడి అయిదారు సిమ్లు వాడుకునే మరో సౌలభ్యమూ న్యాస్టా కల్పిస్తోందని చెబుతోంది.