తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్షలకు సన్నద్ధమవుతూ సరిగా నిద్రపోవట్లేదా?- ఐతే ఈ సమస్యలు తప్పవు!

విద్యార్థులకు తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్య, మానసిక సమస్యలు - చదివింది సరిగా గుర్తుండక అకడమిక్‌ పెర్ఫామెన్స్‌పైనా ప్రభావం - నిపుణులు ఇంకా ఏమిచెబుతున్నారంటే..

GOOD SLEEP FOR GOOD HEALTH
GOOD SLEEP FOR GOOD HEALTH (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 8:09 PM IST

Good Sleep For Better Health : పరీక్షలొచ్చాయంటే చాలు.. రాత్రిళ్లు సైతం మేలుకొని చదువుతుంటారు చాలా మంది స్టూడెంట్స్. రాత్రింబవళ్లు కష్టపడి చదవడం తప్పేం కాదు.. కానీ, శరీరానికి ఎంతో ముఖ్య అవసరమైన నిద్రను నిర్లక్ష్యం చేస్తే అసలుకే ముప్పు వాటిల్లుతుంది! పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు తగినంత స్లీప్ లేకపోతే ఆరోగ్య, మానసిక సమస్యలు చుట్టుముట్టడంతో పాటు చదివింది సరిగా గుర్తుండక అకడమిక్‌ పెర్ఫామెన్స్‌పైనా ఎఫెక్ట్​ పడుతుందంటున్నారు నిపుణులు.

✦ స్టూడెంట్స్​కు నిద్ర చాలా చాలా అవసరం. సరిపడా గాఢనిద్ర లేకపోతే మెమరీ పవర్, అకడెమిక్‌ పెర్ఫామెన్స్‌పైనే కాదు.. మొత్తంగా వారి ఆరోగ్యంపైనే నేరుగా ప్రభావం ఉంటుంది. రోజూ తగినంత స్థాయిలో నిద్రపోవడం వల్ల విద్యార్థుల్లో ఫోకస్‌ పెరగడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగవుతాయి. నేర్చుకొనే ప్రక్రియలో ఇది ఎంతో ప్రధానమైనది.

✦ క్వాలిటీ స్లీప్ లేకపోతే విద్యార్థుల్లో శ్రద్ధాశక్తులు తగ్గడంతో పాటు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ సామర్థ్యం తగ్గడం ద్వారా అకెడమిక్‌ పెర్ఫామెన్స్‌ దెబ్బతింటుంది. ఇంటర్‌, ఆపైన చదివే విద్యార్థులు కనీసం 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది.

✦ భావోద్వేగాలను నియంత్రించుకొనేందుకు రాత్రి నిద్ర ఎంతగానో సహాయపడుతుంది. ప్రెజర్​ను తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

✦ జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడంలో నిద్రదే ప్రధాన పాత్ర . చదివే విషయాలను బ్రెయిన్​లో నిక్షిప్తం చేయడం, ప్రాసెస్‌ చేయడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాంటి నిద్రపట్ల నిర్లక్ష్యం వహిస్తే, మెంటల్​ హెల్త్​ ఇష్యూస్ తలెత్తే ముప్పు పెరుగుతుంది. మానసిక ఆందోళన, చిరాకు, భావోద్వేగ అస్థిరత వంటివీ కలగొచ్చు.

✦ సరిపడా నిద్ర లేకపోతే, పగటిపూట మగతగా ఉండటం, చురుకుదనం కోల్పోవడం, ఏకాగ్రత కష్టతరం కావడం జరుగుతుంది. శరీరానికి నిద్ర రిలాక్సేషన్‌ ఇవ్వడంతో పాటు ఇమ్యునిటీ సిస్టమ్​ను మెరుగుపరుస్తుంది. తద్వారా విద్యార్థులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

✦ నిద్రపోయేటప్పుడు బెడ్​పైన ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి ఉంచుకోవద్దు. నిద్రపోయేముందు వీడియోగేమ్స్‌ వంటివి వాడితే బ్రెయిన్​ ఉత్తేజితమై నిద్ర పట్టనీయకుండా చేస్తుంది.

✦ నిద్రకు ఉపక్రమించే ముందు ఒత్తిడికి గురిచేసే క్రైం సీన్స్​, సస్పెన్స్‌, యాక్షన్‌ మూవీలు చూడటం కూడా అంత మంచిది కాదు. ఇది స్టూడెంట్స్​ కచ్చితంగా పాటించాల్సిన నియమం.

✦ తక్కువగా నిద్రపోతున్న విద్యార్థులు క్లాస్​ రూంలో శ్రద్ధ పెట్టలేకపోవడం, మార్కులు సాధించడంలో ఫెయిల్​ కావడం, పాఠాలు గుర్తుండకపోవడం, మానసిక సమస్యల వంటివాటి బారిన పడుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

✦ కొందరైతే ‘రేపు సెలవే కదా!’ అని ముందురోజు పొద్దుపోయేదాకా మేల్కొని ఉండటం, మరుసటి రోజు వేకువజామున లేవకపోవడాన్ని అలవాటుగా మార్చుకుంటుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. సెలవులైనా, ఎగ్జామ్స్​ అయినా.. ప్రతిరోజు ఒకేటైంకి నిద్రపోవడం, మేల్కోవడాన్ని అలవాటు చేసుకుంటే శరీరానికి ఆ పద్ధతి అలవాటై చురుగ్గా ఉంటారు.

✦ పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధించాలన్నా, ఎగ్జామ్స్​లో నెగ్గాలన్నా, చదువులో పురోగతి సాధించాలన్నా సరిపడా నిద్ర తప్పనిసరి. ఏది మానుకున్నా సరే.. నిద్రకు మాత్రం సమయం కేటాయించాల్సిందే.

ఎంత చదివినా అస్సలు గుర్తుండటం లేదా? - ఇలా చదివితే క్లాస్​లో ఫస్ట్​ ర్యాంక్​ మీదే!

ఫారిన్ వెళ్లి చదువుకునే వారికి గుడ్​న్యూస్ - డబుల్ కానున్న స్కాలర్​షిప్స్!

ABOUT THE AUTHOR

...view details