NMDC JOT Recruitment 2024 :నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వరంగ స్థంస్థ హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) పలు ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆయా విభాగాల్లో జూనియర్ ఆఫీసర్(ట్రెయినీ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది ఎన్‌ఎండీసీ. ఇంతకీ, ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హతలు, జీతభత్యాలు, ఎంపిక విధానం, దరఖాస్తుకి చివరి తేదీ ఎప్పుడు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మొత్తం 153 జూనియర్ ఆఫీసర్ (ట్రెయినీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కమర్షియల్, మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎన్విరాన్‌మెంటల్, జియో అండ్ క్వాలిటీ కంట్రోల్, ఇంజినీరింగ్, సర్వే, కెమికల్, మెకానికల్, ఇండస్ట్రియల్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న పోస్టులు, విద్యార్హతలు, అనుభవం వివరాలిలా..
- మైనింగ్ విభాగంలో 56 ఖాళీలున్నాయి. విద్యార్హతలు వచ్చేసరికి.. మూడేళ్ల మైనింగ్ ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు ఫోర్‌మెన్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి. లేదా మైనింగ్ ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు సెకండ్ క్లాస్ మైన్స్ మేనేజర్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపెటెన్సీ దరఖాస్తు చేసుకునే వారికి ఉండాలి. డిప్లొమా పూర్తిచేసినవారికైతే సంబంధిత రంగంలో 5 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
- ఎలక్ట్రికల్ విభాగంలో 44 పోస్టులున్నాయి. విద్యార్హతలు చూస్తే.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. అలాగే.. సంబంధిత రంగంలో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- మెకానికల్ విభాగంలో 20 ఖాళీలున్నాయి. మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా లేదా మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ వంటివి విద్యార్హతలు. ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- సివిల్ విభాగంలో 9 పోస్టులున్నాయి. సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే నిర్మాణ రంగంలో ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- కమర్షియల్ విభాగంలో 4 ఖాళీలున్నాయి. విద్యార్హతలు చూస్తే.. ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ/ మార్కెటింగ్/ ఫారిన్ ట్రేడ్/ సేల్స్ మార్కెటింగ్‌లో డిప్లొమా లేదా సీఏ/ ఐసీఎంఏ.
వయో పరిమితి :
వయసు 32 ఏళ్లకు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం, ఫీజు :
ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, ఎన్‌ఎండీసీ ఉద్యోగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సూపర్‌వైజరీ స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కులకు నిర్వహిస్తారు. సూపర్‌వైజరీ స్కిల్ టెస్ట్ అర్హత పరీక్ష మాత్రమే.
- సీబీటీలో సాధించిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సూపర్‌వైజరీ స్కిల్ టెస్టుకు సెలెక్ట్ చేస్తారు.
- స్కిల్ టెస్టు సమయంలో విద్యార్హతలు, అనుభవాలకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలను చెక్ చేస్తారు. చివరగా సీబీటీలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.