AP Wine Shop Tenders 2024 :రాష్ట్రంలోని మద్యం షాపులకు ఇప్పటి వరకూ 50 వేల ధరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు పెంపునకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంది. అక్టోబరు 12, 13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన చేయనున్నారు. 14వ తేదీన ఆయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీయనున్నారు. అక్టోబరు 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు నడవనున్నాయి.
New Liquor Shops in AP :విభిన్న వర్గాల నుండి అందిన వినతుల మేరకు మద్యం షాపుల కోసం నిర్దేశించిన దరఖాస్తుల సమర్పణ గడువును అక్టోబరు 11 వరకు పొడిగించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అన్ని విధానాలలో దరఖాస్తులకు అక్టోబర్ 11న సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుందని అన్నారు. అక్టోబరు 12, 13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, 14వ తేదీన ఆయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీస్తారని వివరించారు.
పాత జీవోను సవరించి: అదే రోజు కేటాయింపు ప్రకియను పూర్తి చేస్తామని, అక్టోబరు 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. ఇకనుంచి మద్యం షాపులన్ని ప్రైవేటుగా కొనసాగుతాయని తెలిపారు. కాగా 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం పాలసీని పూర్తిగా ప్రభుత్వం పరంచేసి క్రయవిక్రయాలు చేసింది. అంతే కాకుండా ధరలను సైతం పెంచడంతో జనాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.