ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగం చేస్తూనే డిప్లొమా చదవొచ్చు - ఎలా అంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కళాశాలల్లో 429 సీట్లు - ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

POLYTECHNIC_COURSES_IN_AP
POLYTECHNIC_COURSES_IN_AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 9:01 AM IST

Night Polytechnic College for Working People in AP :ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్‌ చదివేందుకు ఇప్పటికే అవకాశం కల్పించగా ఇప్పుడు తాజాగా డిప్లొమా కోర్సులు చదువుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ పద్ధతిలో పగలు ఉద్యోగం చేసి, రాత్రి పూట డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు. మామూలు రోజుల్లో రాత్రి 6 గంటల - 9 గంటల వరకు, ఆదివారం పూర్తిగా తరగతులు నిర్వహిస్తారు. చాలా మందికి డిప్లొమా చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన వారు. పది, ఐటీఐలతో చదువు ఆపేసి, ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కాలేజీలు ఎంతోగానో ఉపయోగపడతాయి.

ఐటీఐ, డిప్లొమా అర్హతలతో - పవర్​గ్రిడ్ కార్పొరేషన్​లో 1031 పోస్టులు - అప్లై చేసుకోండిలా! - PGCIL Notification 2024

డిప్లొమా, ఆ తర్వాత ఇంజినీరింగ్​ చదివితే ఉన్నత హోదాకు వెళ్లేందుకు మంచి అవకాశం ఏర్పడుతుంది. పని అనుభవానికి విద్యార్హతలు తోడవ్వడంతో ఆయా కంపెనీల్లో ఎదిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6 కాలేజీల్లో 9 బ్రాంచిలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో 30 సీట్లు చొప్పున 390 ఉండగా వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటాల్లో 3 సీట్లు కేటాయించాగా మొత్తంగా 429 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మామూలుగా డిప్లొమా 3 సంవత్సరాలు కాగా, ఈ విధానంలో రెండేళ్లు, రెండున్నరేళ్ల కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ (అక్టోబర్​ 26న) సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

పగలు చదువుకోలేకపోతున్నారా ! - వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ మీకో గుడ్​న్యూస్​ - NIGHT COLLEGES FOR WORKING PEOPLE

అర్హతలు ఇలా : ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో పని చేస్తున్న వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పని ప్రాంతం లేదా నివాసం ఈ విద్యా సంస్థలకు 50 కిలోమీటర్లు లోపు ఉండాలి. కనీసం ఏడాది పూర్తి సమయం/ రెగ్యులర్​ పని చేసినట్లు అనుభవం కలిగి ఉండాలి. అభ్యుర్థులు అప్లికేషన్​ చేసుకున్న పాలిటెక్నిక్​ కాలేజీ వద్దనే కౌన్సెలింగ్​ నిర్వహిస్తారు. అభ్యుర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కౌన్సెలింగ్​ అప్పుడు అభ్యర్థులు అర్హత సర్టిఫికేట్లు, చెల్లించాల్సిన ఫీజుతో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు ఆయా పాలిటెక్నిక్​లకు నేరుగా హాజరు కావాలి.

డిప్లొమా అర్హతతో - రైల్వేలో 7951 జేఈ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - RRB JE Recruitment 2024

కోర్సులు వివరాలు : మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్, సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు రెండేళ్లు అందుబాటులో ఉంటాయి. కెమికల్‌(Oil Technology), కెమికల్‌(Petrochemical), కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు రెండున్నరేళ్ల ఉంటాయి.

ఏ కళాశాలలో ఏ కోర్సులు :

కళాశాల కోర్సులు
విశాఖపట్నం ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌
శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల, చిత్తూరు ఈసీఈ
గోదావరి ఇంజినీరింగ్‌ టెక్నాలజీ కళాశాల, రాజమహేంద్రవరం మెకానికల్, కంప్యూటర్స్‌ ఇంజినీరింగ్‌
వేమూ టెక్నాలజీ కళాశాల, చిత్తూరు ఈసీఈ, ఈఈఈ
బేహర శుభాకర్‌ పాలిటెక్నిక్‌, విశాఖపట్నం ఈసీఈ, ఈఈఈ, ఎంఈ కోర్సులు
ప్రశాంతి పాలిటెక్నిక్‌, అచ్యుతాపురం సీఈ, ఎంఈ కోర్సులు

ABOUT THE AUTHOR

...view details