ETV Bharat / state

భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి - ENCOUNTER IN MULUGU DISTRICTT

ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అడవుల్లో ఎన్‌కౌంటర్

Encounter in Mulugu districtt
Encounter in Mulugu district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2024, 9:31 AM IST

Updated : Dec 1, 2024, 10:21 AM IST

Encounter in Mulugu District : తెలంగాణలోని ములుగు జిల్లా తుపాకీ కాల్పుల మోతలతో దద్దరిల్లింది. ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి. అయితే ఎన్‌కౌంటర్‌పై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.

మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్​కౌంటర్​లో బద్రు(35), మధు(43), కరుణాకర్​(22), జైసింగ్​(25), కిషోర్​(22), కామేశ్​(23), జమున(23) మృతి చెందినట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌- 10మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్​కౌంటర్‌ - ఐదుగురు మావోయిస్టులు మృతి

Last Updated : Dec 1, 2024, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.