Night Diploma Courses in AP :మీరు పదో తరగతి, ఐటీఐతో మధ్యలోనే చదువు ఆపేసి ఉద్యోగంలో చేరారా? అయితే ఉద్యోగం చేస్తూనే డిప్లొమా చదవాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే సాంకేతిక విద్యాశాఖ ఓ సువర్ణావకాశం కల్పించింది. ఓ వైపు ఉదయం ఉద్యోగం చేస్తూనే, మరోవైపు రాత్రి చదువుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మామూలు రోజుల్లా రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు కోర్సులు బోధించగా, సెలవు దినమైన ఆదివారంలో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తారు. ఈ అవకాశం ఉద్యోగం చేస్తూ డిప్లొమా కోర్సు చదవాలనుకునేవారికి మంచి అవకాశంగా మారనుంది.
Night Polytechnic Courses in AP : ఈ అవకాశంతో డిప్లొమా తర్వాత ఇంజినీరింగ్ చేసి ఉన్న ఉద్యోగంలోనే ఉన్నత హోదాకు వెళ్లేందుకు మంచి అవకాశం ఉంది. దీంతో పని అనుభవానికి విద్యార్హతలు తోడవ్వడంతో మీరు పని చేసే కంపెనీలో ఎదిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. ఈ కాలేజీలు ఏపీ వ్యాప్తంగా 6 కాలేజీల్లో 9 బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి.
ఒక్కో కోర్సులో 30 సీట్లు చొప్పున 390 ఉన్నాయి. వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో 3 సీట్లు కేటాయిస్తే 429 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నార్మల్గా అయితే డిప్లమా 3 సంవత్సరాలు. కానీ ఈ విధానంలో రెండేళ్లు, రెండున్నరేళ్లలలో డిప్లొమా పూర్తి చేయవచ్చు. రాత్రి పూట డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఆఖరి తేదీ అక్టోబరు 26. ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి.