Hotel Offered Chicken Biryani For Rs.4 in Vizag : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఫుడ్ కోర్టులు కనిపిస్తున్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, అది కూడా తక్కువ ధరలకే అమ్ముతున్నారు. కస్టమర్లను పెంచుకునేందుకు అప్పుడప్పుడు మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతుంటారు. ఆఫర్ అంటే చుట్టుపక్కల ధరలు చూసుకొని వాటి కంటే ధర కాస్త తగ్గిస్తారు. అదే హోటల్ ప్రారంభోత్సవం అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇక్కడా అదే చేశారు. ఓపెనింగ్ డే రోజు కేవలం రూ.4కే చికెన్ బిర్యానీ పెట్టారు. అంతే ఆ ఆఫర్ విని చుట్టుపక్కల జనాలంతా గుమిగూడిపోయారు. హోటల్ ముందు పెద్ద క్యూ కట్టారు. ఇంతకీ ఇది ఎక్కడంటే?
బిర్యాని కోసం క్యూ కట్టిన జనం (ETV Bharat) రూ.3కే అన్లిమిటెడ్ బిర్యానీ - బారులుతీరిన జనం - ఎక్కడో తెలుసా? - 3 RUPEES BIRYANI OFFER
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రహదారులు, భననాల శాఖ అతిథి గృహానికి సమీపంలో ఓ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఆదివారం మంచి ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.4కే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ అని ప్రకటించడంతో జనం భారీగా వచ్చారు. అయితే ఒకరికి ఒక ప్యాకెట్ మాత్రమే ఇవ్వడంతో చాలా మంది కుటుంబసభ్యులతో సహా క్యూలో నిలబడ్డారు. కొందరు చిన్న పిల్లలతో సహా వచ్చి లైన్లో గంటకు పైగా వేచి ఉండి బిర్యానీ తీసుకుని వెళ్లారు. ఆ ప్రాంతంలో రద్దీ ఏర్పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రారంభోత్సవం సందర్భంగా 3 వేల మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు విక్రయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అర్జెంటీనా గెలిచిందని 1500 బిర్యానీలు ఫ్రీగా పంచిన అభిమాని
బిర్యానీ బిల్లు విషయంలో గొడవ, కత్తితో దారుణంగా పొడిచి