తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో కొత్త ట్రాఫిక్​ రూల్స్​ - భారీ వాహనాలకు నో ఎంట్రీ, ఆ వెహికిల్స్​కు ప్రత్యేక టైమింగ్స్ - Traffic Rules

New Traffic Rules in Hyderabad : జంట నగరాల్లో పెరిగిపోతున్న ట్రాఫిక్​ రద్దీ నియంత్రణకు నగర పోలీస్ అధికారులు నూతన ప్రణాళికలు రూపొందించారు. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ వాహనాలను నగరంలోకి అనుమతించొద్దని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెచ్చారు.

Traffic Rules in Hyderabad
New Traffic Rules in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 9:07 AM IST

New Traffic Rules in Hyderabad : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి పోలీసు ఉన్నతాధికారులు నడుం బిగించారు. నిత్యం పెరిగిపోతున్న వాహనాల రద్దీతో జంటనగరాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి రోజు నగరంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ జాం(Traffic Jam) అవుతోంది. కొన్ని సందర్భాల్లో రోడ్లపై వాహనాలు గంటల తరబడి నిలబడిపోతున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా స్పందించడంతో పోలీసు ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రారంభించారు.

ప్రధానంగా లారీలు, ట్రక్కులు, టస్కర్లు, ట్రాలీలను పగటి వేళలో నగరంలోకి అనుమతి నిరాకరించారు. రాత్రి వేళలోనూ సూచించిన రోడ్లపై మాత్రమే వాటిని అనుమతించనున్నారు. నిర్మాణ సామాగ్రి వాహనాలకు కూడా పగటి వేళలో నగరంలోకి అనుమతి నిరాకరించినట్లు నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు వరకే మాత్రమే ఆయా వాహనాలకు అనుమతి ఉండనుంది.

Hyderabad Traffic Rules :డీసీఎం, ఏచర్, స్వరాజ్ మజ్దా వంటి సరుకు రవాణ వాహనాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 లోపు, సాయంత్రం 4 నుంచి 9 లోపు నగర రోడ్లపైకి అనుమతి నిరాకరించారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైవేట్ బస్సులకు(Private Buses) జంట నగరాల్లోని ఏ రోడ్డులో ఇక నుంచి రాకపోకలు సాగించడానికి ఉండదని పోలీసు అధికారులు తెలిపారు. రెండు టన్నులకు మించి నిర్మాణ వ్యర్థాలు తరలించే వాహనాలకు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జంట నగరాల రోడ్ల మీదకు అనుమతించరు. పది టన్నులకు మించి తరలించే ప్రభుత్వ వాహనాలకు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అనుమతి లేదు.

ఆర్టీసీ బస్సులకు ఈ నిబంధనలు వర్తించవు : అయితే ఆర్టీసీ బస్సులు(TSRTC Buses), ప్రభుత్వ ఏజెన్సీల బస్సులకు ఈ నిబంధనలు వర్తించవని నగర సీపీ పేర్కొన్నారు. తాము సూచించిన నిబంధనలు ఉల్లంఘించే వాహనదారలపై చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించి తమకు సహకరించి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్​లో ట్రాఫిక్ భూతం - అధికారులు చలానాలకే పరిమితం - వాహనదారులకు తప్పని నరకం

ఏఏ వేళల్లో వాహనాలు అనుమతిస్తారు, అనుమతించరు :

  • నిర్మాణ సామాగ్రి వాహనాలకు కూడా పగటి వేళలో నగరంలోకి అనుమతి నిరాకరణ. కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు వరకే అనుమతి.
  • డీసీఎం, ఏచర్, స్వరాజ్ మజ్దా వంటి సరుకు రవాణ వాహనాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 లోపు, సాయంత్రం 4 నుంచి 9 లోపు నగర రోడ్లపైకి అనుమతి.
  • ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైవేట్ బస్సులకు జంట నగరాల్లోని ఏ రోడ్డులో ఇక నుంచి రాకపోకలు సాగించడానికి ఉండదు.
  • రెండు టన్నులకు మించి నిర్మాణ వ్యర్థాలు తరలించే వాహనాలకు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జంట నగరాల రోడ్ల మీదకు అనుమతించరు.
  • పది టన్నులకు మించి తరలించే ప్రభుత్వ వాహనాలకు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అనుమతి లేదు.
  • ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఏజెన్సీల బస్సులకు ఈ నిబంధనలు వర్తించవు.

'మీది మొత్తం వెయ్యి అయ్యింది యూజర్‌ ఛార్జెస్‌ ఎక్స్‌ట్రా’

హైదరాబాద్‌లో పై వంతెనలు, అండర్‌ పాస్‌లు.. సీఎం రేవంత్‌ ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details