తెలంగాణ

telangana

ETV Bharat / state

"తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి బొనాంజా​" - ఇటు వీరి ఖాతాల్లో డబ్బులు, అటు వారికి రేషన్​ కార్డులు

తెలుగు రాష్ట్రాల్లో కొట్లాది కుటుంబాల్లో వెల్లివిరియనున్న ఆనందోత్సహాలు - అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

New Ration cards and RytuBharosa Update
New Ration cards and RytuBharosa Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

New Ration cards and RytuBharosa Update :తెలుగు ప్రజలకు పెద్ద పండగైన సంక్రాంతికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కోట్లాది కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. ఓ వైపు ఆంధ్రప్రదేశ్​లోని కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండగకు ప్రజలకు భారీ కానుకను ప్రకటించింది. రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ రేషన్​ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో పాటు పాత ​ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు డిసెంబర్​ 2వ తేదీ నుంచే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. అర్హత ఉన్న వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హత ఉన్న వారికి నూతన కార్డులను మంజూరు చేస్తారని వెల్లడించింది. ఈ మేరకు బడ్జెట్​ను​ కూడా విడుదల చేసింది.

తెలంగాణలో రైతులకు గుడ్​న్యూస్​ : తెలంగాణలోని రైతన్నలకు రాష్ట్ర సర్కారు గుడ్​న్యూస్​ను ప్రకటించింది. ఇప్పటికే సన్నధాన్యం కొనుగోళ్లపై బోనస్ అందిస్తున్న సర్కారు తాజాగా మరో తీపి కబురు చెప్పింది. రైతులందరూ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం నిధులను సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. గత సర్కారు రైతు బంధు పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడిందనే విమర్శల నేపథ్యంలో అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల మిగులు నిధులతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, రూ.7 లక్షల కోట్లు అప్పు మిగిల్చారని విమర్శించారు. ఇక 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో తీసుకున్న రుణాలన్నీ ఏకకాలంలో తీర్చామని, స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమచేస్తామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలపై చర్చించనున్నట్లుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.

CM Revanth On Rythu Bharosa :రాష్ట్రానికి భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన​ రైతు పండుగ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 25.35లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించారు. గతం బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన అప్పులపై ప్రతినెలా రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని వెల్లడించారు.

రూ.2 లక్షల పంట రుణాల మాఫీని పూర్తి చేశామని, రైతుల బ్యాంకు అకౌంట్లలో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి సైతం మాఫీ పూర్తయ్యిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులు, అధికారుల తప్పిదాలు, బ్యాంకులో టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ జరగకపోతే మళ్లీ సరిదిద్దుతామని, అకౌంట్లలో తప్పులు సరిదిద్దుకుని అధికారులకు చెప్తే రుణమాఫీ పూర్తవుతుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. రేషన్‌కార్డు ప్రామాణికం కాదని చెప్తూ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామని తెలిపారు.

అన్నదాతలకు తీపికబురు​ - త్వరలో జమకానున్న రైతు భరోసా నిధులు

'రైతు భరోసా'పై క్లారిటీ వచ్చేసింది! - అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడేది ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details