Nara Bhuvaneswari Election Campaign in Chitoor District :చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కుప్పంలో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు శాంతిపురం మండలంలో పర్యటించారు. మండలంలోని పలుగ్రామాల్లో పర్యటించి వైఎస్సార్సీపీ పాలనను ఎండగట్టారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు. భువనేశ్వరి వెంట ఆమె సోదరుడు రామకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
నిజం గెలవాలి యాత్ర తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నా: నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari Interview
నారా చంద్రబాబునాయుడి కుటుంబం ఆఖరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతిపురం మండలంలో విస్తృతంగా పర్యటించారు. కర్ణాటక సరిహద్దులో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు చంద్ర బాబు కుటుంబం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబును ఆశీర్వదిస్తూ ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు కుప్పం అభివృద్ధి కోసం ఆయనకు లక్ష ఓట్ల అధిక్యతను అందించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ శ్రేణులు సైకిల్ వేగాన్ని మరింతగా పెంచాలని కోరారు. అడ్డచ్చే దుర్మార్గులను తొక్కుకొంటూ విజయ తీరాల వైపు సాగాలని ఓటర్లుకు పిలుపునిచ్చారు.