ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

13న ముగియనున్న 'నిజం గెలవాలి' యాత్ర - సభకు చురుగ్గా ఏర్పాట్లు - BHUVANESWARI NIJAM GELAVALI YATRA - BHUVANESWARI NIJAM GELAVALI YATRA

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra in NTR District : నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 12, 13వ తేదీల్లో ఎన్టీఆర్‌ జిల్లా పర్యటించనున్నారు. ఇక ఏప్రిల్ 13వ తేదీతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. గత ఆరు నెలలుగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. అందుకోసం ఆమె రాష్ట్రవ్యాప్తంగా 8,500 కిలో మీటర్లు ప్రయాణించారు. ఇప్పటి వరకు ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి అశేష ప్రజాదరణ లభించింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 8:42 PM IST

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra in NTR District :టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జిల్లా పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌తో పలువురు ఆ పార్టీ అభిమానులు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో బాధితులను పరామర్శించటానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పరామర్శ యాత్ర నిర్వహించారు. ఈ పర్యటనలు ఏప్రిల్ 13వ తేదీతో ముగుస్తున్నాయి. ముగింపు సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుటికే విజయవాడలో చురుకుగా సాగుతున్నాయి.

రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలి : నారా భువనేశ్వరి

నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 12, 13వ తేదీల్లో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 12వ తేదీన విజయవాడ చేరుకోనున్న భువనేశ్వరి అక్కడి నుంచి విసన్నపేట మండలం కొండపర్వ గ్రామం చేరుకుంటారు. అక్కడ చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో నిజం గెలవాలి యాత్ర : అనంతరం ఏ కొండూరు మండలం కుమ్మరికుంట్ల, పోలిశెట్టిపాడు గ్రామాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి తిరువూరు మండలం కాకర్ల గ్రామానికి చేరుకోని మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే 13వ తేదీ సాయంత్రం తిరువూరులోని 13వ వార్డులో పర్యటించనున్న భువనేశ్వరి సాయంత్రం తిరువూరులోని దారా పూర్ణయ్య స్థలంలో బహిరంగ సభలో పాల్కొని ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు.

నిజం గెలవాలి యాత్ర ముగింపు కార్యక్రమం :నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం ఏప్రిల్ 13వ తేదీతో ముగియనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుటికే విజయవాడలో చురుకుగా సాగుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుతో 206 మంది మృతి : జైలులో 52 రోజులు గడిపిన తరువాత ఆయనకు బెయిలు మంజూరు అయింది. అయితే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకో లేక 206 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలకు తాము అండగా ఉంటామని నారా భువనేశ్వరి అప్పట్లోనే ప్రకటించారు. అందులో భాగంగానే నిజం గెలవాలి పేరుతో ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఆయా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి భువనేశ్వరి ఆర్థిక సాయం అందజేశారు.

8500 కిలో మీటర్లు నడిచిన నారా భువనేశ్వరి :గత ఆరు నెలలుగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. అందుకోసం ఆమె రాష్ట్రవ్యాప్తంగా 8,500 కిలో మీటర్లు ప్రయాణించారు. అయితే ఈ నిజం గెలవాలి ముగింపు సభ ఏర్పాట్లను విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని పర్యవేక్షిస్తున్నారు.

‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి అశేష ప్రజాదరణ : అయితే భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి అశేష ప్రజాదరణ లభించింది. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో నిజం గెలవాలి యాత్ర ప్రారంభం కాగా ఆరు నెలలుగా కొనసాగింది. విడతలవారీగా ‘నిజం గెలవాలి’ పేరుతో బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు.

'రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రజలంతా చేయిచేయి కలిపి మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి'

కార్యకర్తల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం - నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

ABOUT THE AUTHOR

...view details