Nara Bhuvaneshwari Nijam Gelavali Program: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అండగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా "నిజం గెలవాలి" కార్యక్రమంతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుని ఓదార్చుతున్నారు. ఎవ్వరూ అదైర్యపడోద్దని, బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు.
చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రజల గురించే : నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra at Gutti: 'నిజం గెలవాలి' (Nijam Gelavali) యాత్రలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. గుత్తి మండలం ధర్మపురానికి చెందిన ఆంజనేయులు, భేతాపల్లి నివాసితులు జయమ్మ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెక్కును భువనేశ్వరి అందించారు. పార్టీకి సేవ చేసిన వారి కుటుంబాలకు తెలుగుదేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధిస్తుందని అందరూ ధైర్యంగా ఉండి చంద్రబాబును (Chandra babu Naidu) ముఖ్యమంత్రిని చేసుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయంటూ భువనేశ్వరి పేర్కొన్నారు.