Interim Bail To Radhakishan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుకు శనివారం నాడు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన తల్లికి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. రాధాకిషన్‌రావు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తల్లిని చూడటానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
రాధాకిషన్‌రావు తల్లి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పుపత్రిలో చికిత్స పొందుతోంది. మార్చి 10న ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా, గత మూడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాధాకిషన్‌రావు కోర్టును ఆశ్రయింగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు ఈరోజు ఆయనను పోలీస్ ఎస్కార్ట్ మధ్య చంచల్‌గూడ జైలు నుంచి కరీంనగర్‌కు తీసుకెళ్లారు.
Task Force EX OSD Radhakishan Rao Case Updates :ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు రాధాకిషన్ తన తల్లి వద్ద ఉండనున్నారు. ఆ తర్వాత అధికారులు తిరిగి మళ్లీ జైలుకు తీసుకువెళ్తారు. అయితే ఇందుకయ్యే ఖర్చు అంటే పోలీసు ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది జీతం, భోజనం ఖర్చులు ఇలా మొత్తం కలిపి రూ.18,0000 రాధాకిషన్‌రావు చెల్లించాల్సి ఉంటుంది.
నాటి అధికార పార్టీ సుప్రీమ్ ఆదేశాల మేరకే- రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్డులో కీలక విషయాలు - phone tapping case updates
Telangana Phone Tapping Case Updates :తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎస్ఐబీలో ఆధారాల ధ్వసం, ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో బండారం బయటపడుతోంది. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు రాధాకిషన్‌రావు, విశ్రాంత ఐజీ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావు ఇళ్లలో కొద్దిరోజుల క్రితం తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు.
డీసీపీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్‌రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలతో రాధాకిషన్‌రావును అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయణ్ని విచారించగా విస్తుపోయే విషయాలు బహిర్గతమయ్యాయి. శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా టాస్క్‌ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలింపు చేపట్టినట్లు పోలీసులు విచారణలో ఆయన వెల్లడించారు. మరోవైపు రాధాకిషన్‌రావు బృందంలోని వారిని విచారించగా రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు.
పలువురి ఫోన్లను ట్యాప్‌చేసి వారి నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు రాధాకిషన్‌రావు బృందంపై ఉన్నాయి. ఈ మేరకు ఆయనపై బంజారాహిల్స్ ఠాణాలో పోలీసు కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేసి రాధాకిషన్‌రావు రూ.కోట్లు తీసుకెళ్లారని రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల రూపాయల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల పేర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రాధాకిషన్‌రావుతో పాటు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చి దర్యాప్తు ప్రారంభించారు.
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నగదు తరలింపు! - 'ఫోన్ ట్యాపింగ్'లో తవ్వేకొద్దీ కొత్త విషయాలు - TS Phone Tapping Case
మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - 'రాధాకిషన్ రావు చెప్పినట్లే చేశా' - Phone Tapping Case Updates