తెలంగాణ

telangana

ETV Bharat / state

నీళ్లు అనుకొని యాసిడ్ కలిపిన నీటిని తనపై పోసుకున్న ఐసీఎఫ్​ఏఐ విద్యార్థినికి గాయాలు - ICFAI student sustains burn injurie - ICFAI STUDENT SUSTAINS BURN INJURIE

ICFAI student sustains Burn Injurie : హైదారాబాద్​లోని ఐసీఎఫ్​ఏఐ యూనివర్సిటీలో ఓ యువతికి అనుమానాస్పదరీతిలో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆందోళన చెందిన యువతి స్నేహితుల సహాయంతో ఆసుపత్రికి వెళ్లింది. నీళ్లు అనుకొని యాసిడ్ కలిపిన నీటిని తనపై పోసుకోవడం వల్లనే ఐసీఎఫ్​ఏఐ విద్యార్థినికి గాయాలయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఈ ఘటనపై శుక్రవారం సంబంధిత విశ్వవిద్యాలయ అధికారులు వివరణ ఇచ్చారు. యాసిడ్​ దాడి పేరిట వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.

ICFAI student sustains Burn Injurie
ICFAI student sustains Burn Injurie (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 8:22 PM IST

Updated : May 17, 2024, 3:05 PM IST

ICFAI student sustains Burn Injurie :హైదరాబాద్ శివారు శంకరంపల్లిలోని ఐసీఎఫ్​ఏఐ యూనివర్సిటీలో ఓ యువతికి అనుమానాస్పద రీతిలో తీవ్రగాయాలయ్యాయి. తాను ఉంటున్న హాస్టల్లోని నాలుగో అంతస్థులో స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి, బకెట్‌లో ఉన్న నీటిని ఒంటిపై పోసుకోగానే శరీరంపై బొబ్బలు రావడంతో అప్రమత్తమైన యువతి స్నేహితుల సాయంతో ఆస్పత్రికి వెళ్లింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యాసిడ్ కలిపిన నీటిని విద్యార్థిని తనపై పోసుకోవడం వల్లే గాయాలయ్యాయని అని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు, గాయానికి కారణం ఏంటనే విషయానిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై సంబంధిత విశ్వవిద్యాలయ వీసీ స్పందించారు. యాసిడ్​ దాడి పేరిట వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.

నీళ్లు అనుకొని యాసిడ్ కలిపిన నీటిని తనపై పోసుకున్న ఐసీఎఫ్​ఏఐ విద్యార్థికి గాయాలు (ETV Bharat)

Suspicious Death in Jagtial District : అక్క అనుమానాస్పద మృతి.. చెల్లి అదృశ్యం.. జగిత్యాల జిల్లాలో మిస్టరీ

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం ఐసీఎఫ్​ఏఐ చెందిన హాస్టల్ లో హౌస్ కీపింగ్ పనుల నిమిత్తం బకెట్​లో వేడినీటితో పాటు యాసిడ్ కలిపి ఫ్లోర్ క్లీన్ చేయగా మిగిలిన యాసిడ్ వాటర్​ని బకెట్ లొనే ఉంచడం జరిగింది. బాధిత విద్యార్థిని బకెట్​లో ఉన్నది నీరు అనుకొని కాళ్లు, చేతులు కడుకోవడానికి ప్రయత్నిచడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. ఇది గమనించిన తోటి విద్యార్థినులు, సిబ్బంది ఆమెని నగరంలోని అపోలో హాస్పిటల్​కి తరలించారు. ఈ ఘటనపై ఈరోజు ఆమె తల్లిదండ్రులు మొకీల పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న మొకీల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ అంశంపై విశ్వవిద్యాలయ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు.

విద్యార్థినికి కాలిన గాయలవ్వడంపై స్పందించిన విశ్వవిద్యాలయ వీసీ :గాయపడిన విద్యార్థిని 7:20 కి రూం నుంచి బయటకు వచ్చి తన ఒంటిపై బొబ్బలు వచ్చాయని చెప్పిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. ఎల్​ఎస్​ గణేశ్ తెలియజేశారు. వెంటనే ఆమెకి తమ క్లినిక్ లో చికిత్స అందించాన్నారు. హౌస్ కీపింగ్ వాళ్లు విద్యార్థులు ఉన్నప్పుడు మాత్రమే లోనికి వెళతారని వివరించారు. గదిలో లేఖ్య వర్ధిత ఒక్కతే ఉందని యువతి స్వస్థలం తిరుపతి అని వెల్లడించారు. యువతి ఒంటిపై 40 శాతం కాలిన గాయాలున్నాయన్నారు. అయితే లేఖ్యకు గతంలో ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవని తెలిపారు. కారిడార్ లో సీసీటీవీ విజువల్స్ పోలీసులకు అందించామని తెలిపారు. క్లూస్ టీం అక్కడ వస్తువులను అన్ని తీసుకెళ్లారని తెలిపారు.

"15వ తేదీన యువతికి గాయాలు అయ్యాయి. ఇక్కడే ప్రాథమిక చికిత్స చేసి మంచి ఆసుపత్రికి చేర్పించాం. యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న యాసిడ్ దాడి పేరిట ప్రసారం అయిన వార్తలు తప్పుడు ప్రచారమే. హాస్టల్లో అన్ని రూంలకు పటిష్ఠ భద్రత ఉంది. మా దృష్టికి వచ్చిన విషయం ప్రకారం ఆ యువతికి వేడినీళ్ల వల్లే అలా జరిగి ఉండొచ్చు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు"- డాక్టర్​. ఎల్​ఎస్​ గణేశ్ , ఐఎఫ్​సీఏఐ వీసీ

Bike Accident Viral Video in Adilabad : నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్.. ప్రమాదవశాత్తు మీద పడిన యాసిడ్.. ఆ తర్వాత..!

ఫ్రెండ్ మాట్లాడటం లేదని పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుంది - మొయినాబాద్‌ యువతి దహనం కేసును ఛేదించిన పోలీసులు

Last Updated : May 17, 2024, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details