Bone Stuck in Old Man Throat:తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు నెల రోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మటన్ తింటూ పొరపాటున ఓ ఎముకను మింగేశారు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక లోపల రంధ్రం పడి తీవ్ర సంక్రమణకు కారణమైంది. పైభాగం మధ్యలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆ వృద్ధుడు ఎట్టకేలకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి వచ్చారు. ముందు నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండొస్కొపీ చేసి ఎముక ఉందన్న విషయాన్ని వైద్యులు గుర్తించి ఎల్బీనగర్ ఆస్పత్రికి పంపించారు. ఇక్కడ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక నిట్టల వైద్య బృందం ఆయనను క్షుణ్నంగా పరిశీలించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండొస్కోపిక్ ప్రణాళికతోనే ఆ ఎముకను ఎంతో చాకచక్యంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వివరాలను డాక్టర్ రాధిక తెలిపారు.
విజయవాడలో విషాదం - ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి - Doctor Family Suicide in Vijayawada
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేకపోవడంతో నమలలేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి అక్కడ మటన్ ఉండటంతో తినాలనుకున్నారు. పళ్లు లేకపోవడం వల్ల నమలకుండా నేరుగా మింగేశారు. దీంతో 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక లోపలకు వెళ్లిపోయింది. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. దాంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి లోపల ఎముక ఇరుక్కుందన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించారు.