Remand to Kukkala Vidyasagar in Actress Jethwani Case : ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసులో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు వచ్చేనెల 4 వరకు రిమాండ్ విధించారు. నటి కాదంబరీ జెత్వానీ కేసులో దర్యాప్తులో వెలుగుచూసిన ఆధారాలు, వ్యక్తుల ప్రమేయాన్నిఆధారంగా నిందితులుగా చేరుస్తామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు తెలిపారు. నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను దేహ్రాదూన్‌లో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై రైలులో అర్ధరాత్రి నగరానికి తీసుకొచ్చారు.
ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ వద్దకు విద్యాసాగర్‌ను తీసుకెళ్లారు. అయితే తొలుత స్టేషన్ లోపలికి వెళ్లకుండా విజయవాడ వైపు వాహనాన్ని మళ్లించిన పోలీసులు, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో విద్యాసాగర్‌కు వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం విద్యాసాగర్‌ను తెల్లవారుజామున జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ మేరకు వచ్చే నెల 4 వరకు జడ్జి రిమాండ్ విధించారు. విజయవాడ సబ్ జైలుకు నిందితుడు కుక్కల విద్యాసాగర్ తరలించారు.