ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అజ్ఞాతం వీడిన అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి - కడప సైబర్ క్రైం స్టేషన్​లో విచారణ - AVINASH REDDY PA RGHAVA REDDY

కడపలో పోలీసు విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి

Police Questioned Avinash Reddy PA
Police Questioned Avinash Reddy PA (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 3:40 PM IST

Police Questioned YS Avinash Reddy PA : వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఈ రోజు కడపలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. వర్రా రవీందర్‌రెడ్డి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అవినాష్​రెడ్డి పీఏ ఇచ్చిన కంటెంట్​ని తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని వర్రా పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలించగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు ఈనెల 12 వరకు ఆయణ్ని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

దీంతో నెల రోజుల తర్వాత ఆదివారం నాడు రాఘవరెడ్డి పులివెందులలో ప్రత్యక్షమ్యయాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఉదయం 10 గంటలకు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని సూచించారు. నోటీసులు అందుకున్న రాఘవరెడ్డి ఇవాళ కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో విచారణకు హాజరయ్యారు. తొలుత ఆయణ్ని సైబర్ క్రైమ్ సీఐ విచారించారు.

Varra Ravinder Reddy Case : ఈ క్రమంలోనే జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్​బాబు పోలీస్​స్టేషన్​కి వచ్చారు. రాఘవరెడ్డి విచారణ ఎంతవరకు వచ్చిందనే దానిపై సీఐతో చర్చించారు. ప్రస్తుతం డీఎస్పీ మురళీ నాయక్‌ రాఘవరెడ్డిని విచారిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు పులివెందుల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పీఎస్​కు చేరుకున్నారు.

నెల రోజుల తర్వాత బయటకు - పులివెందులలో ప్రత్యక్షమైన అవినాష్ పీఏ రాఘవరెడ్డి

ABOUT THE AUTHOR

...view details