Mother Daughter Chased Thieves in Hyderabad Video : సంవత్సరం క్రితం పనికావాలని ఇద్దరు వ్యక్తులు ఓ ఇంటికి వచ్చారు. అందుకు అంగీకరించిన యజమాని వారిని పనిలో పెట్టుకున్నాడు. వారు కొంతకాలంగా నమ్మకంగా ఉన్నట్టూ నటిస్తూ ఎక్కడెక్కడ ఏ వస్తువులూ ఉంటాయో గమనించారు. ఇంతలోనే హఠాత్తుగా పని మానేశారు. ఇక్కడే తమ ప్లాన్‌ను అమలు చేశారు. తాజాగా ఆ ఇంట్లోకే దొంగతానికి వచ్చారు. కుటుంబ సభ్యులను గన్‌తో బెదిరించి చోరీ చేసేందుకు యత్నించారు. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
Mother Daughter Fight Robbers in Hyderabad :ఆ ఇంట్లో ఉన్న తల్లీకుమార్తెలు దొంగలను (Robbery in Telangana) ప్రతిఘటించారు. దీంతో వారు తోకముడిచారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రసూల్‌పుర జైన్ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం నవరతన్ జైన్, ఆయన భార్య అమిత మేహోత్ రసూల్‌పురలోని పైగా హౌసింగ్‌కాలనీలో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో అమిత, ఆమె కుమార్తె, పనిమనిషి ఇంట్లో ఉన్నారు.
రైళ్లలో సెల్ఫోన్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్, ఓ వ్యక్తి హత్యతో పట్టుబడ్డ గ్యాంగ్
ఆ సమయంలో ప్రేమ్‌చంద్, సుశీల్‌కుమార్ కొరియర్ సర్వీసు వచ్చిందంటూ ఆ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. వారిని అమిత తలుపు బయటే ఉండాలని చెప్పింది. ఇంతలోనే హెల్మెట్ ధరించిన సుశీల్‌కుమార్ ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించాడు బ్యాగులోని నాటు తుపాకీ బయటకు తీసి ఆమెపై గురిపెట్టాడు. ఈ క్రమంలోనే ప్రేమ్‌చంద్ వంటగదిలోకి వెళ్లి పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశారు.
Mother Daughter Chased Robbers in Begumpet :అదే సమయంలో అమిత సుశీల్‌ను బలంగా కాలుతో నెట్టేసింది. ఈ క్రమంలోనే ఆమె కుమార్తె కూడా రావడంతో అతడిని గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైనా సుశీల్ దాడి చేస్తున్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. గత్యంతరం లేక అతను తుపాకీ వదిలి పరారయ్యాడు. ఈ లోపు తల్లీకుమార్తెల కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్‌చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.