తెలంగాణ

telangana

ETV Bharat / state

వలపు వలతో తెలుగు యువత విలవిల - ఆ జిల్లాలోనే ఎక్కువ మంది బాధితులు

ప్రేమ పేరుతో వలపు వల - ఆ పిలుపునకు చిక్కారో జేబులు గుల్ల - సరికొత్త పంథాలో సైబర్ మోసాలు - ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కుప్పలుతెప్పలుగా బాధితులు

beware of honey trap
Honey Trap Cases Increased in Vizag (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2024, 12:44 PM IST

Honey Trap Cases Increased in Vizag : యువకులకు కాల్ చేస్తారు. తీయగా మాట్లాడతారు! పరిచయం పెంచుకుంటారు. ఫొటోలు పంచుకుంటారు. 'ప్రేమ' పేరుతో దగ్గరవుతారు. ఆపై జంటగా వ్యవహరిస్తారు!! అంతే, ఇక ఆ యువతుల వలపు వలలో యువకులు చిక్కినట్లే!! జంటగా ఉన్న చిత్రాలతో బెదిరింపులకు దిగుతారు! అడిగినంత ఇవ్వకపోతే రౌడీ ముఠాలతో దాడి చేయిస్తారు. ఇలాంటి ‘హనీ ట్రాప్‌’ కేసులు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వెలుగు చూస్తుండగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.

ఏపీలో జరిగే సైబర్‌ మోసాల్లో బాధితులు ఎక్కువ మంది విశాఖ నగర వాసులే ఉంటున్నారు. వైజాగ్ కేంద్రంగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు తెగబడటం, ఇతర దేశాల్లోని ముఠాలతో కలిసి ఇక్కడే సెంటర్​లు ఏర్పాటు చేయడం కలవరపెడుతోంది. నెల రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చిన అనేక మోసాల తీరు తెలిసి నగరవాసులు ఉలిక్కిపడుతున్నారు.

హనీట్రాప్‌ కేసు ఆమెతో సరి :వైజాగ్​లోనిమురళీనగర్‌ కేంద్రంగా జాయ్‌ జమీయా అనే యువతి హనీట్రాప్‌ (ప్రేమ పేరుతో వలలో వేసుకోవడం)కు తెర లేపింది. జమీయా బాధితులు ఇటీవల ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఓ ఎన్‌ఆర్‌ఐ కంప్లైంట్​తో ఈ నెల 4న భీమిలి స్టేషన్‌ పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. 5న కోర్టుకు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. 9వ తేదీన భీమునిపట్నం ఠాణాకు జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకుని ఏసీపీ అప్పలరాజు విచారణ చేశారు. ఈ క్రమంలో బాధితులు ముందుకొచ్చి కంచరపాలెం, విమానాశ్రయం స్టేషన్లలోనూ జెమీయాపై కేసులు పెట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈమె బాధితులున్నారు. ఎలా ప్రేమ వలలో వేసుకోవాలి? మత్తు ఎలా ప్రయోగించాలి? వీడియోలు తీసి ఎలా బ్లాక్‌మెయిల్‌ చేయాలి? అనే అంశంపై ఓ ముఠా టైనింగ్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ముఠాను అదుపులోకి తీసుకోలేదు.

ఓ అటవీశాఖ అధికారి హడావుడి :ఈ ముఠాలో ఓ అటవీశాఖ అధికారి హస్తం ఉన్నట్లు సమాచారం. హనీట్రాప్‌ చేస్తున్న జెమీయా అకౌంట్ నుంచి ఆ అధికారి అకౌంట్​కు నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించి, సదరు అధికారిని పిలిపించి గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విచిత్రమేమంటే ఆమెను అరెస్టు చేసిన టైంలో ఆ అధికారి పోలీసులకు ఫోన్‌ చేసి హడావుడి చేసినట్లు తెలుస్తోంది. ‘జెమీయా నాకు రిలేటివ్ అవుతుంది. ఏవిధంగా కేసు పెడతారు? ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులనే హెచ్చరించడంతో అనుమానం వచ్చి ఆయన బ్యాంకు అకౌంట్​లు, లావాదేవీలు, ఫోన్‌ కాల్స్‌పై దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది.

సిటీలోనే ఉంటూ..

✵ సెప్టెంబర్‌ 28న దిల్లీలో నమోదైన కేసులో భాగంగా ఎండాడ, మురళీనగర్‌లో ఉంటూ కాల్‌ సెంటర్లు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేసింది. నిరుద్యోగులే లక్ష్యంగా వీరు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

✵ చైనా, తైవాన్‌లోని సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తూ వైజాగ్ కేంద్రంగా కాస్మెటిక్స్‌ సేల్స్ పేరుతో బెట్టింగ్‌ యాప్‌లు, టాస్క్‌ గేమ్‌లు, ఫెడెక్స్‌ పార్శిల్స్ నిర్వహిస్తున్న ఏడుగురితో కూడిన ముఠాను 17న అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌ నిఘా డిపార్ట్​మెంట్ నుంచి విశాఖకు సమాచారం వచ్చింది. విశాలాక్షినగర్, ఏఎన్‌బీచ్‌ దగ్గరలోని ప్లాట్లు రెంట్​కు తీసుకుని సైబర్‌ మోసాలకు పాల్పడుతూ, బ్యాంకు అకౌంట్​లు సేకరించి సొమ్ము కాజేసి చైనా, తైవాన్‌కు నగదు ట్రాన్స్​ఫర్ చేస్తున్నట్లు గుర్తించారు.

✵ ఏపీకి చెందిన నిరుద్యోగ యువతే లక్ష్యంగా ఫేక్ ఐడీలతో బ్యాంకు ఖాతాలు తెరిచి వారి నుంచి డబ్బులు కాజేస్తున్న నలుగురు ముఠా సభ్యులను శుక్రవారం అరెస్టు చేశారు. 17 రాష్ట్రాల్లో 50 సైబర్‌ నేరాల కంప్లైంట్​లు అందగా, రూ.40 కోట్ల లావాదేవీలు ఈ ముఠా జరిపినట్లు గుర్తించారు.

New Rules for Social Media in India 2023 : 'ఫొటోలు పెట్టొద్దు.. రీల్స్‌ చేయొద్దు'.. భద్రతా బలగాలకు వార్నింగ్​

పరిచయం ప్రేమగా మారింది - ఆ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది! - ఆ ఒక్క డెసిషన్​తో?

ABOUT THE AUTHOR

...view details