తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆహారోత్పత్తుల సంస్థలు - మార్కెటింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేస్తూ ఉపాధి - Food Processing Units Growth in Hyd - FOOD PROCESSING UNITS GROWTH IN HYD

Most Innovative Food Companies in Hyderabad : వివిధ రకాల రుచులను చూపించే ఆహారోత్పత్తుల సంస్థలు ఎక్కువగా వెలుస్తున్నాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాయిలో ఏర్పడుతున్న ఆ సంస్థలద్వారా ఆశించిన స్థాయిలో క్రయవిక్రయాలుసాగుతున్నాయి మహిళా సంఘాలతో పాటు చిన్నచిన్న వ్యాపారులు ఆ యూనిట్లను నెలకొల్పుతున్నారు. మార్కెటింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న రుణాలు ఆహారోత్పత్తుల సంస్థల ఏర్పాటుకు కొంతమేర సాయపడుతోంది.

Futurist Food Companies
Most Innovative Food Companies (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 6:59 PM IST

పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆహారోత్పత్తుల సంస్థలు - మార్కెటింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేస్తూ ఉపాధి (ETV Bharat)

Food Processing Units Growth in Hyderabad :పచ్చళ్లు, గారెలు, లడ్డూలు, ఇతర చిరుతిళ్లకి మార్కెట్‌లో మంచిగిరాకీ ఉంది. ప్రస్తుతం జీవనవ్యయం పెరగడంతో భార్యభర్తలిద్దరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తుండటం, వంట చేసుకునేందుకు తగిన సమయం లేకపోవడంతో చిరుతిళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

బయట లభించే రెడీమేడ్ పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటుంటంతో ఆహార ఉత్పత్తులకు ఆదరణపెరిగింది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చాలా మంది వ్యాపారులు ఆహారోత్పత్తి సంస్థలు నెలకొల్పుతున్నారు. చిన్నపాటి యూనిట్ల నుంచి మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నారు. మహిళా సంఘాలు సైతం ఆహారోత్పత్తి సంస్థలని నెలకొల్పుతున్నాయి.

మార్కెటింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేస్తూ ఉపాధి : స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులకు వచ్చేరుణాలతో వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. రుచికరమైన స్నాక్స్‌ ప్యాక్‌చేసి విక్రయిస్తున్నారు. కొన్ని సంస్థలైతే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేస్తున్నాయి. స్థానికంగా విక్రయించడంతో పాటు, సమీప పట్టణాలకు సరఫరా చేస్తున్నారు.

"అన్నిరకాల వంటలను ఇంట్లోనే తయారుచేస్తాం. పదిమంది వరకు మా దగ్గర పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఏ చోటుకైనా మేము డెలివరీ చేస్తాం. ఈ ఆలోచన అనేది మహిళా గ్రూప్​ ద్వారా మాకు వచ్చింది. రూ.10 లక్షల లోన్​ తీసుకొని ముందు వేరే కంపెనీ పెట్టుకుంటే అందులో సరిగ్గా రాణించలేకపోయాను. తరవాత ఈ చిరుతిళ్లను తయారు చేయటం మొదలుపెట్టాం." -రాజమణి, సింధు హోమ్ ఫుడ్స్, కరీంనగర్

Innovative Food Products : ఆర్ధిక పురోగతిలో ఆహారోత్పత్తుల సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కనీసం ఐదుగురి నుంచి 100 మందివరకు ఆ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్తరకమైన రుచులను పరిచయం చేసేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఆహారోత్పత్తుల సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చేలా ఫుడ్ ఫెయిర్‌లు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారోత్పత్తుల సంస్థలకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడం సహా శిక్షణ, మార్కెటింగ్‌లో మెలకువలను నేర్పిస్తున్నారు. శుచి, శుభ్రత, నాణ్యత పాటించి రుచికర ఉత్పత్తులు చేసే సంస్థలకు వినియోగదారులు నుంచి మంచి ఆదరణ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

"ఫుడ్​ పరిశ్రమ అనేది ఎప్పటికీ అంతంలేనిది. ఇందులో కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు వస్తున్నాయి. ప్రజల జీవనశైలి మార్పుల వల్ల సమయంలేక, వండుకొని తినేంత సమయం వెచ్చించక ఇప్పుడు చాలామంది రెడీ టూ ఈట్​ ఫుడ్​కు మొగ్గుచూపుతున్నారు. ఉన్నపాటుగా శక్తినిచ్చే ఎన్నో ప్రొడక్ట్స్ కూడా మార్కెట్​లోకి​ అందుబాటులోకి వస్తున్నాయి." -శ్రీకాంత్, ఫుడ్ ఫెయిర్ నిర్వాహకుడు

అలర్ట్ : నైట్​​షిఫ్ట్ చేస్తున్నారా? - ఈ ఆహారపు అలవాట్లు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు! - Night Shift Healthy Diet

ఈ పదార్థాలు పచ్చిగా తినడం కంటే - ఉడికించి తింటే 'డబుల్​' బెనిఫిట్స్​! - Benefits of EATING BOILED FOODS

ABOUT THE AUTHOR

...view details