Mohan Babu Tweet Latest : సీనియర్ నటుడు మోహన్‌బాబు మరోసారి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను. నా ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేదు. వాస్తవాలను మాత్రమే బయటపెట్టాలని మీడియాను కోరుతున్నాను." అని మోహన్‌బాబు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లో పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని వార్తలు వచ్చాయి. తాజాగా మోహన్‌బాబు తన పోస్ట్‌లో ఈ వార్తల్లో నిజం లేదని ఖండించారు. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారు ఎం.రంజిత్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబందించి కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ కేసు మొత్తం నేపథ్యం విలేకరిపై దాడి కేసులో మోహన్‌బాబుకు ఊరట లభించలేదని వార్తలు వచ్చాయి.
అసలేం జరిగింది : వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని జల్పల్లిలో సినీనటుడు మోహన్‌బాబు, మనోజ్ కుమార్ మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్‌బాబు నివాసానికి చేరుకోగా.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గేట్లను తెరవలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన మంచు మనోజ్ గేట్లను తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. మంచు మనోజ్‌తో పాటు అక్కడే ఉన్న మీడియా ఆయనతో పాటు లోపలికి వెళ్లింది.