MLC Kavitha Writ Petition in Supreme Court :దిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేకపోయినా తనను ఇరికించేలా ఈడీ దర్యాప్తు చేపడుతోందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ సహా అభియోగ పత్రాల్లో ఎక్కడా తనను నిందితురాలిగా పేర్కొనలేదని వివరించారు. 2022లో సీబీఐ ఏడు గంటలపాటు విచారించిందన్న ఆమె ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలిగా చేర్చలేదని తెలిపారు. కొందరి వాంగ్మూలాల ఆధారంగా తనను మద్యం కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దిల్లీ లిక్కర్ విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని కవిత పేర్కొన్నారు.
Delhi Liquor Scam Updates : ఈడీ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగట్లేదన్నకవిత (MLC Kavitha on ED Arrest)సాక్షులపై థర్డ్ డిగ్రీ పద్ధతులను వినియోగిస్తుందని ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఇ.చందన్‌రెడ్డిపై చేయిచేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణనని చెప్పారు. ఆయన వినికిడి శక్తి కోల్పోయారని పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుసరిస్తున్న కఠిన పద్ధతుల కారణంగానే పి.శరత్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారినట్లు వివరించారు. దీన్నిబట్టి దర్యాప్తును ఈడీ పారదర్శకంగాకొనసాగించడం లేదని తెలుస్తోందని కవిత వెల్లడించారు.
ఆప్ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం కుంభకోణానికి తెరలేపారు : ఈడీ
MLC Kavitha ED Custody : మరోవైపు సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీకి విరుద్ధంగా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందన్న కవిత ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే దిల్లీకి తరలించినట్లు రిట్ పిటిషన్‌లో తెలిపారు. అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలు పూర్తిగా అవాస్తవమనీ ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ దరఖాస్తు సైతం తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నారు. మనీ లాండరింగ్ చట్టం-2002లోని సెక్షన్ 19(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు తమ వద్ద సాక్ష్యాధారాల ఆధారంగా కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని కవిత అన్నారు.