MLC Kavitha Interim Bail Petition in Delhi Liquor Case : తెలంగాణ మాజీ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. సోమవారం తీర్పు వెలువరించనుంది. అంతకు ముందు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రిజాయిండర్‌ను కవిత తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్‌పై కవిత తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలి: సీబీఐ - CBI ON MP AVINASH REDDY BAIL
Delhi Liquor Case Update :అయితే బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఆమెకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. దిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారన్న ఈడీ, ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు, ఆమె 10 ఫోన్లు ఇచ్చినా, అన్నీ ఫార్మాట్ చేసే ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని వివరించారు.