ETV Bharat / state

దేశంలోనే అతి పెద్ద సెమీకండక్టర్ పరిశ్రమ - కర్నూలు దశ తిరిగినట్లేనా? - SEMI CONDUCTOR FACTORY KURNOOL DIST

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో 14 వేల కోట్లతో భారీ సెమీ కండక్టర్‌ పరిశ్రమ- పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌ వెల్లడి

SemiConductor_Factory
SEMI CONDUCTOR FACTORY IN ORVAKALLU AT KURNOOL (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2025, 11:02 AM IST

Updated : Jan 12, 2025, 11:37 AM IST

Semi Conductor Factory in Kurnool District: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో 14 వేల కోట్ల రూపాయలతో భారీ సెమీ కండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరినట్లు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. సెమీ కండక్టర్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన ఇటోయె మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, భారత్‌కు చెందిన హైడ్రైస్‌ గ్రూప్, బీఎన్‌ గ్రూప్‌లు రాష్ట్ర ప్రభుత్వం మధ్య హైదరాబాద్‌లో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగినట్లు ఆయన వెల్లడించారు.

14 వేల కోట్లతో భారీ పరిశ్రమ: భారీ సెమీ కండక్టర్‌ పరిశ్రమను 14 వేల కోట్లతో మనదేశంలో మొదటిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు కానుందని టీజీ భరత్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేశ్ కృషితో ఈ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురాగలిగామన్నారు. గత నెలలో మంత్రి లోకేశ్​తో ఈ కంపెనీల ప్రతినిధులు అమరావతిలో సమావేశమై పెట్టుబడులు పెట్టే విషయమై చర్చించారని, ఇప్పుడు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.

దీంతో వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని వివరించారు. రాయలసీమలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు పెట్టుబడులకు ఎంతో అనుకూలమైందన్నారు. అక్కడ ఈ సెమీకండక్టర్‌ ప్రాజెక్టుతోపాటు మరికొన్ని పరిశ్రమలు రానున్నాయని మంత్రి వెల్లడించారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న సీఎం ఆలోచనల్లో భాగంగా ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయన్నారు.

దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా: కాగా సుమారు 130 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ సెమీ కండక్టర్ పరిశ్రమతో ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. స్పీడ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా రెండున్నర సంవత్సరాలలో పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు తాజాగా అవగాహన ఒప్పందం కుదరింది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే దేశంలోనే అతి పెద్ద సెమీ కండక్టర్ పరిశ్రమగా ఇది రికార్డు సృష్టించనుంది.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం: మంత్రి లోకేశ్

ప్రపంచానికి తలమానికంగా విశాఖ డేటా సిటీ: మంత్రి లోకేశ్‌

Last Updated : Jan 12, 2025, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.