ETV Bharat / offbeat

పిల్లలు గోంగూర తినడం లేదా ? ఇలా "గోంగూర గుడ్డు పొరటు" చేసి పెట్టండి! ఇష్టంగా తింటారు! - GONGURA EGG​ PORUTU IN TELUGU

-గోంగూరతో అద్దిరిపోయే కోడిగుడ్డు పొరటు -సింపుల్​గా ఇంట్లో చేసేయండిలా!

How to Make Gongura Egg​ Porutu
How to Make Gongura Egg​ Porutu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2025, 10:43 AM IST

How to Make Gongura Egg​ Porutu : గోంగూర ఈ పేరు చెప్పగానే మనలో చాలా మందికి నోరూరిపోతుంది. ఎక్కువ మంది గోంగూరతో పప్పు, పచ్చడి చేస్తుంటారు. అలాగే గోంగూర చికెన్, మటన్​ రెసిపీలు కూడా వండుతారు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉండేవే! అలాగని ఎప్పుడూ ఒకేలా తినాలన్నా కూడా కాస్త బోరింగ్​గా అనిపిస్తుంది. కాబట్టి, ఓసారి ​ఇలా 'గోంగూర కోడిగుడ్డు పొరటు' ప్రిపేర్ చేసుకోండి. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీతో అన్నం తినేకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా గోంగూరతో చేసిన ఈ ఎగ్​ పొరటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ ఎగ్​ పొరటు ఎలా తయారు చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • ఎర్ర గోంగూర ఆకులు - పావు కేజీ
  • గుడ్లు-5
  • కారం- సరిపడా
  • గరం మసాలా - టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె -3 టేబుల్​ స్పూన్లు
  • కొత్తిమీర తరుగు- 100 గ్రాములు
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్​ - టేబుల్​స్పూన్​
  • పసుపు - పావు టీస్పూన్​

తయారీ విధానం :

  • ముందుగా గోంగూర ఆకులను తెంపి శుభ్రంగా నీటిలో కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో కొద్దిగా ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆపై ఎగ్స్ అన్ని పగలగొట్టండి. ఇందులో కాస్త ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకోండి.
  • ఎగ్స్​ మిశ్రమం మరీ చిన్నగా కాకుండా పెద్ద ముక్కలుగా ఉడికించి ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేపండి.
  • అనంతరం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • ఆనియన్స్​ బ్రౌన్​ కలర్లోకి త్వరగా రావడానికి కాస్త ఉప్పు వేయండి. ఇప్పుడు కరివేపాకులు, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్​ వేసి ఫ్రై చేయండి.
  • ఆపై కట్​ చేసిన గోంగూర ఆకులు, కొత్తిమీర వేసి కలపండి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి గోంగూర ఆకులు 10 నిమిషాలు మగ్గించుకోండి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసి మిక్స్​ చేయండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కోడిగుడ్డు పొరటు వేసి కలపండి.
  • ఇప్పుడు పైన కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర కోడిగుడ్డు పొరటు మీ ముందుంటుంది.
  • నచ్చితే ఇలా ఓ సారి ట్రై చేయండి.

'తొక్కలో పచ్చడి' మీరెప్పుడైనా తిన్నారా? తెలుగు వారి స్పెషల్ రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేయండి!

ఈ 'మసాలా ఎగ్ పులుసు' ఎప్పుడైనా తిన్నారా? బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.