Mirchi Rates Falls Down In Warangal : మిరప ధరలు మిర్చి రైతులను కంటతడి పెట్టిస్తోంది. గతేడాది బహిరంగ విపణిలో రికార్డు ధరలను నమోదు చేసిన మిరప, ప్రస్తుతం నేల చూపు చూస్తోంది. ఒక్కసారిగా ఎర్ర బంగారం ధర తగ్గడంతో రైతులు దిగాలు పడుతున్నారు. పెట్టుబడులు కూడా దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Mirchi Rates Down In Enumamula Market Yard: ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. ఎటుచూసినా మిరప బస్తాలతో నిండుకుండలా మార్కెట్ యార్డు దర్శనమిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాకుండా పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున సరుకు తీసుకొస్తున్నారు.
మిరప పంటకు తెగుళ్ల ముప్పు - రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాలపై ఎఫెక్ట్
వ్యవసాయ మార్కెట్‌కి పెద్దఎత్తున సరుకు రావడంతో అదునగా భావించిన వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారు. జెండాపాట పాడినా మార్కెట్ యార్డులో మాత్రం ఆ ధర ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే దక్కుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జెండాపాట 21వేలు ప్రకటించినా వ్యాపారులు మాత్రం 15 వేలలోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
Mirchi Rates In Warangal Enumamula Market: గతేడాది కనిష్టంగా రూ.30 వేలు గరిష్టంగా రూ.90 వేలకు పైగా మిరప ధర పలకడంతో రైతులు ఈ ఏడాది పెద్ద మొత్తంలో మిర్చి సాగుచేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి సగానికి పడిపోయిందని రైతులు అంటున్నారు. గతేడాది ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రాగా, ప్రస్తుతం 10 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.