Gravel Quarry Accident Due To Negligence of Management in NTR District :ఎన్టీఆర్ జిల్లా పరిటాల వద్ద కంకర క్వారీలో జరిగిన ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని గనులు, భూగర్భశాఖ నివేదించింది. పై నుంచి భారీ బండరాళ్లు పడి కింద పని చేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కంకర డ్రిల్లింగ్ పనులు చేపట్టడం వల్ల బండరాళ్లు దొర్లిపడ్డాయని నివేదికలో తెలిపారు. క్వారీ లైసెన్సు రద్దు చేస్తూ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కార్మికశాఖ అధికారులు పూర్తి నివేదిక రూపొందించి ఆ శాఖ కమిషనర్‌కు పంపారు. కంకర క్వారీ యాజమాన్యం పవన్ గ్రానైట్ అండ్ మెటల్ వర్క్స్ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని నిర్థారించారు. కనీసం బూట్లు, తలకు హెల్మెట్ లాంటి రక్షణ పరికరాలు అందించలేదు.
3 Workers Lost Breath In Granite Quarry At Nandigama, NTR District :చనిపోయిన వారిలో దుర్గరాజ్ స్వయంగా యంత్రం తెచ్చి డ్రిల్ చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో యాజమాన్యం పనులను అనధికారికంగా అప్పగించింది. ఈ పరిస్థితులను నివేదించిన గనుల భద్రత విభాగం పవన్ గ్రానైట్ అండ్ మెటల్ వర్క్స్‌కు లైసెన్సు రద్దుకు సిఫార్సు చేసింది. కార్మికశాఖ కమిషనర్ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు ఆదేశాలు ఇవ్వనున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం - క్వారీ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం - Accident in Quarry Several Dead