Minister Ponnam Attend in Poshana Aarogya Jatara Program :పిల్లలు, తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం ప్రారంభించిందని, ఆ వేడుక ఇవాళ కరీంనగర్లో జరుపుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది గర్భిణీలు, చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. గ్రామాల్లో ప్రతివారం పోషణ ఆరోగ్య జాతర నిర్వహించి అందరికి అవగాహన కల్పించాలన్నారు.
గర్భిణీగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రక్తహీనత ఇతర లోపాలు వస్తున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సీతక్క మంత్రిగా రాష్ట్రంలో రక్తహీనత ఎవరికి ఉండకూడదని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించిన పొన్నం, ప్రభుత్వమే కాదు ప్రజలు సహకరించాలని కోరారు. మనం పాలను ఉత్పత్తి చేస్తున్నాం కానీ, మనం వాడుకోకుండా బయట నుంచి తెచ్చుకుంటున్నామని తెలిపారు. హుస్నాబాద్‌లో ప్రతి ఇంటా పాల ఉత్పత్తి జరుగుతుందన్న మంత్రి, అవసరం ఉన్నన్ని వాడుకొని డైరీకి ఇస్తారని తెలిపారు.
Nutrition Health Fair in Karimnagar :గ్రామీణపరంగా అంగన్వాడీ, ఏఎన్ఎం ఆశా కార్యాకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బలమైన బిడ్డలను ఈ తెలంగాణకు అందించాలని కోరారు. మంత్రి సీతక్క రాత్రి పగలు తేడా లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారన్న పొన్నం, అధికారులు తమ డ్యూటీ అయిపోయిందా, అని చెప్పినమా కాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని సూచించారు.