Minister Uttam slams KCR on Kaleshwaram :మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే దిగువన ఉన్న భద్రాచలం, ఏటూరు నాగారంతో పాటు వివిధ బ్యారేజీలకు ముప్పు ఏర్పడుతుందని నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ నీరు నిల్వ చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారంటే ఏ రాజకీయ దురుద్దేశం ఉందో అర్థం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనను పిక్నిక్‌గా అభివర్ణించిన ఆయన, పదేపదే గోబెల్స్ ప్రచారంతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక వ్యక్తి ఆలోచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఎవరూ చేసి ఉండరని, ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో రుణాలు తీసుకున్నారని, ఏడాదికి కాళేశ్వరంపై రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి - UTTAM ON THUMMIDIHETTI BARRAGE
ఇరిగేషన్ వ్యవస్థ నాశనం..కాళేశ్వరం పూర్తయ్యి అన్ని మోటార్లు రన్ చేస్తే వ్యయం ఇంకా పెరుగుతుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ మెుత్తాన్ని కేసీఆర్ నాశనం చేశారని ఆయన దుయ్యబట్టారు. 93 వేల ఎకరాల ఆయకట్టు కోసం రూ.94 వేల కోట్లు ఖర్చు చేశారని, మొత్తంగా కేసీఆర్ హయాంలో ఇరిగేషన్‌పై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కాగ్ లెక్కల ప్రకారం కాళేశ్వరం పూర్తి కావాలంటే రూ.1.47 లక్షల కోట్లు కావాలని ఆయన తెలిపారు.
ప్రాజెక్టు మరింత భారం.. కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువని, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను పూర్తిస్థాయిలో రన్ చేస్తే కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందని మంత్రి వెల్లడించారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. మేడిగడ్డ మెుదలుపెట్టినప్పుడు, కూలినప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఆయన గుర్తు చేశారు.
మేడిగడ్డలో పిల్లర్లు 6 అడుగుల లోపలికి కుంగాయని, నాసిరకంగా నిర్మించడం వల్లే బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేసిందన్నారు. ఎన్డీఎస్‌ఏ నివేదికపైనా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. గతంలో కాళేశ్వరం చూస్తామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎవరైనా కాళేశ్వరం చూసేందుకు ఆంక్షలు లేవని ఆయన తెలిపారు. ఒక్క ఎంపీ సీటు రాకపోయినా బీఆర్ఎస్‌కు ఇంకా సిగ్గు రాలేదా? అని ప్రశ్నించారు.
"కమీషన్ల కక్కుర్తి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపివేసింది. ఒక వ్యక్తి ఆలోచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఎవరూ చేసి ఉండరు. ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి".- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి
బీఆర్ఎస్ దోపిడీ విధానానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయింది : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on Kaleshwaram Works
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి : మంత్రి ఉత్తమ్ - Minister Uttam Kumar Tirumala Tour