'త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు - ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్న బియ్యం' - NEW RATION CARDS FROM JANUARY
కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న మంత్రి ఉత్తమ్ - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడి
Published : 5 hours ago
|Updated : 4 hours ago
New Ration Cards Will Be Issued From Month of January :సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మండలిలో పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కొత్తగా 36 లక్షల మందికి ఇవ్వాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలిపారు. కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామన అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తామన్నారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్‌లు ఏర్పాటు చేసిఅందజేస్తామన్నారు.