Minister Thummala on Farmer Schemes : రాష్ట్రప్రభుత్వం త్వరలో రైతులకు గుడ్‌న్యూస్ చెప్పబోతుందా అంటే.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా పెంపు, పంటల బీమా పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ వ్వవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో(Minister Bhatti) సమావేశమయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది : తుమ్మల - Tummala nageswara rao fires On KTR
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా పథకాలు అమలు చేయడానికి అవసరమైన నిధుల గురించి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించినట్లు మంత్రి తుమ్మల(Minister Thummala) తెలిపారు. ఆయా పథకాల అమలు కోసం ఆర్థికపరమైన అంశాలు, ఎంత మొత్తం నిధులు అవసరమవుతాయి? ఇతర పాలనపరమైన అనుమతులు వంటి అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరినట్లు తెలిపారు.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పంట రుణాలు వసూలు కోసం రైతులను ఇబ్బంది పెట్టవద్దని, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు, బ్యాంకులకు సూచించినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతాంగం సౌకర్యార్థం వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి రసాయన ఎరువులు, విత్తనాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా పండ్ల పక్వానికి కార్బైడ్ ప్రయోగించే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, జొన్న వంటి రకాల పంటల కొనుగోలు సజావుగా సాగాలని తుమ్మల పేర్కొన్నారు.
Rabi Paddy Procurement in Telangana 2024 :మరోవైపు రాష్ట్రంలో ధాన్యం సేకరణ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్ల(Grain Purchase Centres) ప్రక్రియ ప్రారంభించిన దృష్ట్యా సేకరణ ప్రశాంతంగా జరుగుతోంది. తాజా రబీ పంట కాలం ముగింపు దశకు చేరుతున్న వేళ వరి కోతలు ఆరంభమైన నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర ఐదు ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది.
విత్తనాల సరఫరాలో కంపెనీలు ప్రభుత్వానికి సహకరించాలి : మంత్రి తుమ్మల - MINISTER TUMMALA ON SEEDS SUPPLY
నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : మంత్రి తుమ్మల