తెలంగాణ

telangana

మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సర్కార్‌ శ్రీకారం - నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛదనం - పచ్చదనం - CLEANLINESS DRIVE IN TELANGANA

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 7:01 AM IST

Updated : Aug 5, 2024, 8:01 AM IST

Cleanliness and Greening Programin Telangana : రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతను, పచ్చదనాన్ని పెంచేలా ఈ కార్యక్రమం ద్వారా చర్యలు చేపట్టనున్నారు. ఐదు రోజులు పాటు సాగేలా వివిధ ప్రణాళికలతో పాటు గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ములుగు జిల్లాలోని అబ్బాపురంలో మంత్రి సీతక్క స్వచ్ఛదనం-పచ్చదనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Plantation and Cleanliness Drive in TG
Cleanliness and Greening Program (ETV Bharat)

Plantation and Cleanliness Drive in TG : పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతను- పచ్చదనాన్ని పెంచేలా, స్వచ్ఛదనం-పచ్చదనం అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ములుగు జిల్లా అబ్బాపురంలో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. అనంతరం మంగపేటలో జరిగే అవగాహన సదస్సులో పాల్గొంటారు. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సమస్యలను పరిష్కరించనున్నారు.

గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్‌లు : నా గ్రామం- నా గౌరవం అనే నినాదంతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, వనమహోత్సం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పల్లెల రూపురేఖలు మార్చే స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. స్వచ్ఛద‌నం- ప‌చ్చద‌నం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. దోమల నివారణ, ఇంకుడుగుంతల నిర్వహణ, కొత్త ఇంకుడు గుంతల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

పోడుభూమి.. నా తండ్రికి చట్ట ప్రకారం వచ్చిన హక్కు - మీరు దానం చేయలేదు : మంత్రి సీతక్క - SEETHAKKA SLAMS BRS ON PODU LANDS

అవ‌గాహ‌న కార్యక్రమాలు : ఐదు రోజులు సాగే ఆ కార్యక్రమంలో స్థానికనాయకులు, స్వయం సహాయక బృందాలు, యువత, వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేపడుతారు. తడి-పొడి చెత్తపై అవ‌గాహ‌న కార్యక్రమాలు చేప‌డ‌తారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, బస్టాప్‌లు తదితర ప్రాంతాలను శుభ్రపరుస్తారు.

వ్యాధులపై ప్రచారం : గ్రామీణ ప్రాంతాల్లో శౌచాలయాలు లేని ఇళ్లలో గ్రౌండింగ్ పనులు 15 రోజుల్లో చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. నీటి సంరక్షణలో భాగంగా అన్ని తాగునీటి వనరులను శుభ్రం చేస్తారు. రోజూ క్లోరినేషన్ అయిన నీటినే సరఫరా చేసేలా మూడు స్థాయిల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంకుడు గుంత‌ల ఏర్పాటు, రోడ్లలో గుంతల పూడ్చివేత, వరద నీరు తరలిపోయేలా చర్యలు చేపట్టనున్నారు. కుక్కల బెడదతో పాటు డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ఎస్​హెచ్​జీలు, ఆశాలతో ప్రచారం నిర్వహిస్తారు.

వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని పంచాయతీలు, పట్టణాలలో జ్వర సర్వే నిర్వహిస్తారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో కుక్కల సర్వే చేపడుతారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు శుభ్రపర్చేలా ఫ్రైడేను డ్రైడేగా అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు పాటించేలా చ‌ర్యలు చేప‌డుతారు. శిథిలమైన భవనాలు, గోడలు ఉంటే తొల‌గిస్తారు. వనమహోత్సవం కింద గుర్తించిన గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలలోని అన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేప‌డతారు. ప్రతి ఇంటికి ప్లాంటేషన్ కింద కనీసం 6 మొక్కలు పంపిణీ చేస్తారు.

అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలు మావి : మంత్రి సీతక్క - Telangana Assembly Session 2024

ట్వీట్​ దుమారం - స్మితా సభర్వాల్​పై మంత్రి సీతక్క ఫైర్ - SMITA SABHARWAL CONTROVERSY UPDATES

Last Updated : Aug 5, 2024, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details