Minister Ponnam Prabhakar Review on Ramzan Festival : ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ వేడుకను ఘనంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద షామియానాలు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సరఫరా(Power Supply) ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రంజాన్ నెల సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం, సచివాలయంలో ఇవాళ అధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన - అందరి సలహాలు, సూచనలతో ముందుకెళ్తాం : మంత్రి పొన్నం
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న మొదటి రంజాన్‌ను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే కోరిన విధంగా రంజాన్ మాసంలో 24 గంటలు దుకాణాల నిర్వహణకు అనుమతిని పరిశీలించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వివిధ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు(Drinking Water Problems) తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Minister Ponnam Key Instructions to Officials :మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులను ఇబ్బందులు కలిగించవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు, కార్మిక శాఖ అధికారులకు(Labor Department Officials) పొన్నం ప్రభాకర్ సూచించారు. రంజాన్ నెలలో ఇఫ్తార్, షేహార్ సమయాల్లో తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించద్దని ట్రాఫిక్ పోలీస్ అధికారులకు మంత్రి తెలిపారు.