తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉచిత బస్సు పథకంపై కావాలనే అవహేళన వీడియోల ప్రచారం : మంత్రి పొన్నం - MINISTER PONNAM ON FREE BUS VIDEOS - MINISTER PONNAM ON FREE BUS VIDEOS

Minister Ponnam on Free Bus Satrical Videos : మహిళలను అవమానపరిచే విధంగా ఉచిత బస్సు పథకంపై అవహేళనగా వస్తున్న వీడియోలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి సంబంధించి కొన్ని వీడియాలు ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్‌ మీడియా ద్వారా వస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Minister Ponnam on Free Bus Videos
Minister Ponnam on Free Bus Satrical Videos (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 4:26 PM IST

Updated : Jul 31, 2024, 6:19 PM IST

Minister Ponnam on Free Bus Videos :ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్​ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని, రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి సంబంధించి కొన్ని వీడియాలు ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్‌ మీడియా ద్వారా వస్తున్నాయని ఆయన ఆరోపించారు. మహిళలు బస్సుల్లో ఊరికనే తిరుగుతున్నారని ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్​ హామీల అమలుపై ఏలేటి ప్రశ్నల వర్షం - ఘాటుగా స్పందించిన మంత్రి పొన్నం - BJP MLA Eleti Vs Minister Ponnam

వెల్లిపాయలు తీస్తున్న వీడియోలు : హుజురాబాద్ నుంచి జమ్మికుంట వెళ్తున్న బస్సులో వెల్లిపాయలు తీసుకుంటూ వెళ్తున్నారని వీడియోలు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. రవాణాశాఖ మంత్రిగా డిసెంబర్ 9 నుంచి మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం పథకం విజయవంతం కావడంతో, విపక్ష పార్టీల కళ్లు మండుతున్నాయని ఆయన​ దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఉచిత బస్సు సౌకర్యం పథకం ద్వారా 70 కోట్ల మంది ప్రయాణం చేశారని మంత్రి పేర్కొన్నారు.

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం ఉందా? లేదా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఈ పథకం ఇష్టం లేకనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆటో కార్మికుల విషయం తీసుకువస్తున్నారని, పొన్నం ​ ధ్వజమెత్తారు. మహిళలను అవమానపరిచే విధంగా ఏ పనిలేకుండా అవహేళనగా వస్తున్న వీడియోలపై చర్యలు తీసుకోవాలని ఆయన సభాపతిని కోరారు. మెట్రో వచ్చిన తర్వాత 5 లక్షల మంది ప్రయాణికులు వెళ్తుంటే అప్పుడు ఆటోల మీద ప్రభావం పడలేదా? అని మంత్రి ప్రశ్నించారు. ఓలా, ఊబర్ వచ్చిన తర్వాత ఆటోల మీద ప్రభావం పడలేదా? అన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్​ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి సంబంధించి కొన్ని వీడియాలు ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్‌ మీడియా ద్వారా వస్తున్నాయి. హుజురాబాద్ నుంచి జమ్మికుంట వెళ్తున్న బస్సులో ఓ మహిళ వెల్లిపాయలు తీసుకుంటూ వెళ్తున్నారని వీడియోలు వచ్చాయి. మహిళలను అవమానపరిచే విధంగా ఏ పనిలేకుండా అవహేళనగా వస్తున్న వీడియోలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. - పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీసంక్షేమ శాఖ మంత్రి

బీసీల కోసం లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు - బడ్జెట్‌లో 20వేల కోట్లైనా పెట్టలేదు: కేటీఆర్ - telangana assembly session 2024

హైదరాబాద్​కు ఒక్క రూపాయి తీసుకురానివాళ్లు మనకు అవసరమా? : మంత్రి పొన్నం - PONNAM ON HYDERABAD DEVELOPMENT

Last Updated : Jul 31, 2024, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details