Telangana Thalli statue unveiling Ceremony : ఈ నెల 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. విగ్రహావిష్కరణకు రావాలని పలువురు ప్రముఖులకు ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను కలిసి ఈ నెల 9న జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆహ్వనపత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.
కేసీఆర్‌కు ఆహ్వానపత్రం అందజేసిన మంత్రి పొన్నం :ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఆయనతో సుమారు గంట 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన వేడుకలకు రావాలని కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్ ఆహ్వానపత్రం అందజేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ , ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు ఉన్నారు.
'తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను, ప్రోటోకాల్ అధికారులము కలిశాము. తెలంగాణలో అందరినీ గౌరవించాలి అనేది మా పార్టీ తీసుకున్న నిర్ణయం. లంచ్ టైంలో వచ్చాము కనుక కేసీఆర్ లంచ్ చేయమంటే చేశాము. మా భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ వస్తారా? రారా అన్న నిర్ణయం పార్టీలో చర్చించి తీసుకుంటారు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.