తెలంగాణ

telangana

ETV Bharat / state

Viral Video : కామ‌న్ సెన్స్ ఉందా? - మ‌హిళా క‌లెక్ట‌ర్‌పై మంత్రి పొంగులేటి సీరియస్ - PONGULETI SERIOUS ON COLLECTOR

కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి - మంత్రుల పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లపై అసహనం

Minister Ponguleti Srinivasa Reddy Series on Collector Pamela Satpathy
Minister Ponguleti Srinivasa Reddy Series on Collector Pamela Satpathy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 9:01 PM IST

Minister Ponguleti Srinivasa Reddy Serious on Collector Pamela Satpathy :కరీంనగర్‌లో మంత్రుల పర్యటన సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను నాలుగైదు సార్లు పలువురు తోసుకుంటూ వెళ్లడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. "కామన్‌ సెన్స్‌ ఉందా? వాటీజ్‌ దిస్ నాన్సెస్‌" అంటూ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్పీ ఎక్కడ అంటూ కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఇద్దరు కేంద్రమంత్రులు, మరో ఇద్దరు రాష్ట్రమంత్రులు పర్యటన సందర్భంగా ఏం ఏర్పాట్లు చేశారని సీరియస్ అయ్యారు. కుమ్మరి వాడ పాఠశాలలో డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ క్రమంలో మేమంటే రోజు ఏదో సర్దుకుంటామని, నలుగురు మంత్రులు ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితియేనా అని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? - సీఎం రేవంత్ సీరియస్

ABOUT THE AUTHOR

...view details