తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై కీలక అప్డేట్​ - వచ్చే వారం అందుబాటులోకి ప్రత్యేక యాప్

ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌కు ప్రత్యేక యాప్‌ - యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాల‌ని సూచించిన పొంగులేటి

Special APP For Indiramma House Beneficiaries
Special APP For Indiramma House Beneficiaries (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Special APP For Indiramma House Beneficiaries : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్​ను రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్లడించారు. ల‌బ్దిదారుల సెలక్షన్​ విధానం పార‌ద‌ర్శకంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర‌మ్మ ఇళ్లు ఇస్తామ‌ని తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శ‌నివారం స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో మంత్రి ప‌రిశీలించారు. ఈ యాప్‌లో ఒక‌టి రెండు మార్పు చేర్పుల‌ను సూచించారు.

మంత్రి సూచ‌న‌ల ప్రకారం యాప్‌లో కొన్ని మార్పులు చేసి వ‌చ్చే వారంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కాన్ని ప్రారంభిస్తామ‌ని, ఇందుకు కావ‌ల‌సిన ఏర్పాట్లు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాల‌ని సూచించారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేవ‌ర‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వీలైనంత‌వ‌ర‌కు వాడుకోవాల‌ని సూచించారు. ఇళ్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమ‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌న్నారు.

ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3500 నుంచి 4000 ఇళ్లు : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెలఖారు అయ్యేసరికి ఎలానైనా అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపుపై మంత్రి పొంగులేటి ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు. ఈనెల ఆఖరు నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3500 నుంచి 4000 ఇళ్లను మంజూరు చేయ‌బోతున్నామ‌ని ప్రకటించారు.

వ‌చ్చే నాలుగు సంవ‌త్సరాల‌లో రాష్ట్రంలో అర్హులైన పేద‌వారంద‌రికీ ఇందిరమ్మ హౌసింగ్​ స్కీంలో భాగంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడ‌మే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమ‌న్నారు. వచ్చే నాలుగు సంవ‌త్సరాల‌లో కనీసం 20 ల‌క్షల ఇళ్లకు త‌గ్గకుండా నిర్మిస్తామ‌న్నారు. కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇవ్వడ‌మే ఈ ప్రభుత్వ ఆశ‌య‌మ‌ని తేల్చిచెప్పారు. ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావ‌ల‌సిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామ‌న్నారు.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి ప్రాధాన్యత వారికే : మంత్రి పొంగులేటి - Ponguleti On Indiramma House Scheme

'ఇందిరమ్మ ఇండ్లు' లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ - మూడు నెలల్లో అర్జీల పరిశీలన పూర్తయ్యేలా ప్లాన్ - Indiramma Illu Scheme in Telangana

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details